Mokshagna: ప్రశాంత్ వర్మ అవుట్.. మోక్షజ్ఞ కోసం స్టార్ డైరెక్టర్ ని రంగంలోకి దింపిన బాలయ్య.?
Mokshagna: నందమూరి బాలకృష్ణ వారసుడు ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని వేయికళ్లతో ఎదురుచూసిన నందమూరి అభిమానులకు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ మొదటి సినిమా ఉంటుంది అని తెలిసి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఎన్నో వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టడంతో బాలయ్య అభిమానులకు పండగ వాతావరణం నెలకొంది.

Balayya who brought in a star director for Mokshagna
కానీ సడన్గా మోక్షజ్ఞ మూవీ నుండి ప్రశాంత్ వర్మ తప్పుకున్నట్టు వార్తలు రావడంతో నందమూరి ఫ్యాన్స్ అందరూ నిరాశ పడ్డారు.అయితే ప్రశాంత్ వర్మ తప్పుకోవడంతో స్టార్ డైరెక్టర్ ని బాలకృష్ణ రంగంలోకి దింపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆ డైరెక్టర్ ఎవరయ్యా అంటే..(Mokshagna)
Also Read: Samantha: శోభిత నుండి ఆయన్ని కాపాడుకో.. తమన్నాకి సమంత సలహా..?
కల్కి 2898 AD సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన పేరును వైరల్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్..కల్కి సినిమాతో తన సత్తా ఏంటో ప్రపంచానికి రుచి చూపించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ ని బాలయ్య తన కొడుకు మొదటి సినిమాకి దర్శకుడిగా తీసుకున్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే నాగ్ అశ్విన్ తో కథా చర్చలు జరిపినట్టు సమాచారం.

ఒకవేళ అన్నీ ఓకే అయితే గనుక ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఉన్న దర్శకుడితో మోక్షజ్ఞ మొదటి మూవీ ఉండబోతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ వార్త టాలీవుడ్ సినీ వర్గాల్లో వినిపించడంతో మోక్షజ్ఞ మూవీకి నాగ్ అశ్వినే దర్శకత్వం చేయాలి అని నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.(Mokshagna)