Roja: రోజా ని టార్చర్ చేసిన బాలయ్య.. ఎవ్వరూ లేనప్పుడు షూటింగ్ స్పాట్ కి రమ్మని.?
Roja: తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ రోజా అంటే ఎంతటి పేరు సాధించిందో మనందరికీ తెలుసు. ఈమె తన నటన చాతుర్యంతో తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా మంచి గుర్తింపు సాధించింది. అలాంటి రోజా తెలుగు సినిమా ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరితో నటించింది. ఒకప్పటి చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి వారితో తెరను పంచుకుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ కేవలం సినిమాలే కాకుండా రాజకీయాల్లో కూడా రాటు తేలిపోయింది.
Balayya who tortured Roja
అయితే ఈమె ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ గా కొనసాగుతున్న సమయంలో బాలకృష్ణ వల్ల అనేక ఇబ్బందులు పడిందట. ఆయన ఆ పని చేయాలంటూ టార్చర్ పెట్టేవాడట.. చివరికి షూటింగ్ సమయానికి ముందుగానే వచ్చి ఆయన చెప్పిన మాట ప్రకారం అలాంటి పని చేసేదట. ఇంతకీ ఆయన ఏమనే వారు ఎందుకు అలా చేసేవారో ఇప్పుడు చూద్దాం. బాలకృష్ణ అంటే ఇప్పటికి ఇండస్ట్రీలో చాలామంది భయపడిపోతారు. (Roja)
Also Read: Anitha: ముసలి బిజినెస్ మాన్ తో నువ్వు నేను మూవీ హీరోయిన్ ఎఫైర్.. నిజమేనా.?
కానీ ఆయన ఎంత కోపంగా ఉంటారో అంత మంచి మనసున్న వ్యక్తి. బాలకృష్ణతో రోజా ఎన్నో సినిమాల్లో నటించింది. ఇందులో చెప్పుకోదగ్గ చిత్రం పెద్దన్నయ్య. ఈ సినిమా షూటింగ్ సమయంలో రోజాకి బాలయ్య ఆహారం తినిపించి ఇబ్బంది పెట్టాడట. ముందుగానే షూటింగ్ సెట్లోకి రమ్మని క్వాలిటీ అయినటువంటి టిఫిన్స్ భోజనం పెట్టించే వారట. అంతేకాదు బాగా తినాలని తాను దగ్గరుండి వడ్డించేవాడట..ఇదంతా తనపై ప్రేమతో చేస్తున్నాడని అనుకుంది రోజా, కానీ దానికి అసలు కారణం వేరే ఉందట.
ఇందులో బాలకృష్ణ రెండు పాత్రలు ఒకటి అన్నగా మరొకటి తమ్ముడిగా. ఇందులో పెద్దన్న పాత్రకు జోడిగా రోజా నటించింది. ఆ టైంలో రోజా కాస్త సన్నగా ఉంటుందని పెద్దన్న పాత్రకు సెట్ కావాలంటే కాస్త లావు కావాలని ఎక్కువగా భోజనం పెట్టి ఆ తర్వాత షూటింగ్ సెట్లోకి రమ్మనే వారట. ఆ సినిమా షూటింగ్ అయిపోయే సరికి ఆయన రోజాకు ఫుడ్ పెట్టించి మరి ఎన్నో ఇబ్బందులు పెట్టారని రోజా ఇంటర్వ్యూలో నవ్వుకుంటూ చెప్పింది. ప్రస్తుతం ఆ మాటలు మరోసారి వైరల్ అవుతున్నాయి.(Roja)