Allu Arjun: టాలీవుడ్ నుండి అల్లు అర్జున్ ని బ్యాన్.. ఆ హీరో ఫ్యాన్స్ డిమాండ్.?
Allu Arjun: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్న ఇష్యూ ఏంటయ్యా అంటే అల్లు అర్జున్ పుష్ప2 సినిమా సందర్భంగా జరిగిన ఘోర సంఘటన.. డిసెంబర్ 4వ తేదీన పుష్ప2 సినిమా చాలా అట్టహాసంగా రిలీజ్ అయింది. దీంతో సినిమా బెనిఫిట్ షోకి సంబంధించి నాలుగవ తేదీన సంధ్య థియేటర్ కి వేలాదిమంది అభిమానులు చేరుకున్నారు. ఇదే తరుణంలో అల్లు అర్జున్ ఫ్యామిలీ కూడా సినిమా చూడటానికి అదే థియేటర్ కు వచ్చింది.
Ban Allu Arjun from Tollywood
ఈ క్రమంలోనే జరిగినటువంటి తొక్కి సలాటలో రేవతి అనే అభిమాని అక్కడికక్కడే మృతి చెందగా, తన కొడుకు శ్రీ తేజ తీవ్రంగా గాయాలపాలై ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఇది జరిగిన తర్వాత అల్లు అర్జున్ పై కేసు నమోదు అయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు అల్లు అర్జున్ ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేసి చంచల్ గూడా జైలుకు తరలించారు. దీంతో ఆయన ఉండటంతో ఇండస్ట్రీ అంతా అతలాకుతలమైంది. దీంతో అల్లు అర్జున్ అరెస్టు వెనక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందంటూ అనేక వార్తలు రాస్తూ వచ్చారు.. (Allu Arjun)
Also Read: Bunny: రాబోయే రోజుల్లో మెగా ఫ్యామిలీకి టార్చర్.. బన్నీ జాతక సీక్రెట్ చెప్పిన జ్యోతిష్యుడు.?
దీంతో ఇదే విషయంపై తాజాగా అసెంబ్లీలో స్పందించినటువంటి రేవంత్ రెడ్డి హీరోలైన, ఎవరైనా సరే చట్టం ముందు సమానులే అని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో ఉండే హీరోలు మానవత్వం లేకుండా ఉన్నారని రేవతి అనే ఫ్యామిలీ రోడ్డున పడితే వారి కుటుంబాన్ని ఆదుకోకుండా అల్లు అర్జున్ కు ఏమో అయినట్టు ఆయనకు పరామర్శలు చేస్తున్నారని గట్టిగా ప్రశ్నించారు. అంతేకాదు ఇక తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచేది లేదని ఖరాకండిగా చెప్పేశారు. ఇక ఈ విషయంపై సినీ ఇండస్ట్రీ అంత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
బైక్ కట్ అల్లు అర్జున్ అంటూ ఒక సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఒక హీరో కోసం ఇండస్ట్రీ అంతా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారట.. సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతకాలం తెలంగాణలో టికెట్ల రేట్లు పెరగవని బెనిఫిట్ షోలు ఉండవని గాబరా పడుతున్నారట. ఇలాగైతే ఎలా బ్రతకాలి అంటూ ఇండస్ట్రీ వారు అనుకుంటున్నారట. ఒక్క హీరో కోసం మేమంతా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని వారు భావిస్తూ ఉన్నారట.. మరి దీనిపై అల్లు అర్జున్ ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది తెలియదు. మరి దీనిపై మీ కామెంట్ ఏంటో చెప్పండి.(Allu Arjun)