IPL 2025:: బీసీసీఐ కొత్త రూల్స్… ఇక IPL ప్లేయర్స్ కు ఇక నరకమే ?
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక ప్రకటన చేసింది. ఇకపైన కొత్త రూల్స్ అమలు చేయబోతున్నట్టు వెల్లడించింది బీసీసీఐ. మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ లో… కఠిన రూల్స్ అమలు చేసేలా రంగం సిద్ధం చేసింది.

BCCI brings strict rules for IPL 2025
మొన్నటి వరకు టీమిండియా కు ఎలాంటి రూల్స్ అమలు చేస్తున్నారా ఇప్పుడు కూడా అలాంటి రూల్స్ పెట్టాలని డిసైడ్ అయింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఐపీఎల్ ప్లేయర్లు అలాగే స్టాఫ్ కుటుంబ సభ్యులను డ్రెస్సింగ్ రూమ్ లోకి అస్సలు తీసుకురాకూడదని వార్నింగ్ ఇచ్చింది. ప్లేయర్లు మ్యాచులు, ప్రాక్టీస్ సెషన్లకు కచ్చితంగా.. జట్టు ప్రకటించిన బస్సులోనే వెళ్లాలని వెల్లడించింది.
ప్రవేట్ వెహికల్స్ అస్సలు వాడకూడదని హెచ్చరించింది. ముఖ్యంగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్స్ లాంటివి అందుకునేటప్పుడు స్లీవ్ లెస్ జెర్సీలు అసలు వాడకూడదని వార్నింగ్ ఇచ్చింది. పైన చెప్పిన రూల్స్ ఎవరైనా బ్రేక్ చేస్తే ఫస్ట్ వార్నింగ్ ఇస్తామని ఆ తర్వాత మళ్లీ అది రిపీట్ అయితే ఫైన్ ఉంటుందని తెలిపింది.