Mohammad Shami: ప్రమాదంలో మహమ్మద్ షమీ… డెడ్ లైన్ విధించిన బీసీసీఐ
Mohammad Shami: టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీకి కొత్త కష్టాలు వచ్చాయి. ఫిట్నెస్ నిరూపించుకునేందుకు డెడ్ లైన్ విధించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. తాము ఇచ్చిన గడువులోపు… బరువు తగ్గడమే కాకుండా ఫిట్నెస్.. నిరూపించుకోవాలని ఆదేశించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ తరుణంలో ఫిట్నెస్ పై దృష్టిపెట్టాడు మహమ్మద్ షమీ. Mohammad Shami
Bcci Dead Line To Mohammad Shami
ఆస్ట్రేలియాతో జరిగే మూడో టెస్టు లో ఆడాలంటే కచ్చితంగా… తగినంత ఫిట్నెస్ సాధించాలని ఆదేశించింది బీసీసీఐ. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ టీ 20 టోర్నీ ఆడుతున్న మహమ్మద్ షమీకి ప్రతిస్పెల్ అనంతరం.. మెడికల్ టెస్ట్ నిర్వహించబోతున్నారు బీసీసీఐ అధికారులు. Mohammad Shami
Also Read: RCB Twitter Post: వివాదంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఫైర్ అవుతున్న హార్డ్ కోర్ ఫ్యాన్స్!!
దీనికోసం ప్రత్యేక వైద్య బృందం రంగంలోకి దిగబోతుంది. అయితే ఈ నేపథ్యంలో బరువు ఎక్కువ ఉన్నాడా ? ఫిట్నెస్ సాధించాడా ? అనేది తేల్చనుంది ఈ మెడికల్ బృందం. దీనికి పది రోజుల సమయం విధించారు. ఈలోపు తన ఫిట్నెస్ సాధిస్తే.. ఆస్ట్రేలియాతో జరిగే మూడవ టెస్టుకు మహమ్మద్ షమీ సెలెక్ట్ అవుతాడు. లేకపోతే ఆ టోర్నమెంట్ కు దూరం అవుతాడు. ఇది ఇలా ఉండగా మొన్నటి వేలంలో మొహమ్మద్ సమీని 10 కోట్లకు పైగా ధర పెట్టి కొనుగోలు చేసింది హైదరాబాద్. Mohammad Shami