Vishal: ఆ సమస్య వల్లే విశాల్ పెళ్లికి దూరం.. ఆ హీరోయిన్ తో పెళ్లి వరకు వెళ్లి..?
Vishal: తమిళ నటుడు విశాల్ నిజంగానే ఆ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అందుకే 50 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్నారా..ఆ హీరోయిన్ తో పెళ్లి వరకు వెళ్లి క్యాన్సిల్ చేసుకోవడానికి కారణం కూడా అదేనా.. ఇంతకీ విశాల్ కి ఉన్న సమస్య ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం కోలీవుడ్ సోషల్ మీడియాలో,మెయిన్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నారు విశాల్.
Because of that problem Vishal is far from marriage
ఎందుకంటే ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. విశాల్ 2013లో నటించిన మదగదరాజ సినిమా ఫైనల్ గా 2025లో విడుదలకు నోచుకుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సమయంలో అందరూ విశాల్ నీ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఎందుకంటే కనీసం నడవడానికి కూడా ఓపిక లేక చేతులు కాళ్లు వణుకుతూ చాలా దారుణమైన పరిస్థితిలో విశాల్ కల్పించారు. దీంతో విశాల్ కి ఏమైంది అని ఆయన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.(Vishal)
Also Read: Chiranjeevi: డైరెక్టర్ తో చిరంజీవి గొడవ.. “విశ్వంభర” సినిమాకి ఆటంకాలు.?
ఇక విశాల్ హై ఫీవర్ తో బాధపడుతున్నారని కొంతమంది అంటే విశాల్ కి బ్రెయిన్ లో నరాల డామేజ్ ఉందని, ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే గత కొద్ది రోజుల ముందే విశాల్ కి ఈ సమస్య ఉందట. బ్రెయిన్ లో నరాలు కాస్త దెబ్బ తినడం కారణంగా విశాల్ కి తీవ్రమైన తలనొప్పి వస్తుందట. అయితే దీనికి ఫారెన్ లో చికిత్స తీసుకుంటున్నారట విశాల్. అలాగే విశాల్ తొందర్లోనే ఈ సమస్య నుండి బయటపడతారని డాక్టర్లు చెబుతున్నారు.
ఇక ఈ నటి అనీషా రెడ్డితో ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి వరకు వెళ్లాక పెళ్లి చేసుకోకపోవడానికి కారణం కూడా విశాల్ కి ఉన్న హెల్త్ ప్రాబ్లమ్సే అంటూ కుటుంబ సభ్యులు రీసెంట్గా ఈ విషయాన్ని బయట పెట్టారు.దీంతో విశాల్ పెళ్లి చేసుకోక పోవడానికి కారణం ఆయనకున్న హెల్త్ సమస్యలా అంటూ చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. అలాగే విశాల్ పూర్తి ఆరోగ్యంగా ఉండాలని,ఆరోగ్యం కుదుటపడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.(Vishal)