Curd Rice: పెరుగు అన్నం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు…!
Curd Rice: వేసవికాలం వచ్చిందంటే చాలు చాలామంది పెరుగు ఇష్టంగా తింటారు. ఇక మరి కొంతమంది మధ్యాహ్నం సమయంలో పెరుగు అన్నం తప్పకుండా తింటారు. కనీసం రెండు ముద్దలైన సరే పెరుగన్నం కడుపులో పడాల్సింది. పెరుగన్నం తిన్నట్లయితే కడుపులో చల్లగా, హాయిగా ఉంటుంది. అంతేకాకుండా పెరుగుతో కలిపి అన్నం తిన్నట్లయితే హాయిగా నిద్ర పడుతుంది. పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి. శరీరానికి పెరుగు ఎంతో మేలును చేస్తుంది. పెరుగుతో తిన్నట్లయితే బొద్దుగా అవుతారు. పూర్వకాలంలో పెరుగు అన్నం తప్పకుండా తినేవారు.

Benefits of eating Curd Rice
ఇక నేటి కాలంలో పెరుగు అన్నం తినడం చాలా తగ్గించేశారు. కానీ వేసవికాలంలో పెరుగు అన్నం తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు సూచనలు చేస్తున్నారు. చిన్నపిల్లలకు కూడా వేసవికాలంలో పెరుగు అన్నం తినిపించినట్లయితే వారి కడుపులో చల్లగా ఉంటుంది. మండే ఎండలో పెరుగు అన్నం తిన్నట్లయితే శరీరంలో ఉన్న వేడిని కరిగించేయవచ్చు. పెరుగన్నం తిన్నట్లయితే చిన్న పిల్లలు హాయిగా నిద్రపోతారు. వారికి సులువుగా జీర్ణం అవుతుంది. కడుపులో మంట, అలర్జీ, అసిడిటీ లాంటి సమస్యలు ఉన్నా కూడా పెరుగు అన్నంతో తగ్గిపోతాయి. ఇక చాలామంది వేసవికాలంలో పెరుగుతో మజ్జిగను చేసుకొని తాగుతూ ఉంటారు.
ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. మండుటెండలో ఒక గ్లాసుడు మజ్జిగ తాగినట్లయితే డీహైడ్రేషన్ లాంటి సమస్యలు తొలగిపోతాయి. ఎండ వేడిమి నుంచి బయటపడవచ్చు. ఒక గ్లాసుడు మజ్జిగ తాగినట్లయితే కడుపు నిండుగా ఉంటుంది. ఆకలి వేయదు. పెరుగుతో లస్సి చేసుకుని తాగినా కూడా చాలా మంచిది. పెరుగుతో పెరుగు అన్నం, పెరుగు చట్నీ లస్సీ, మజ్జిగ ఇలా ఏ రూపంలో అయినా సరే వేసవికాలంలో పెరుగును తప్పకుండా తినాలి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తుంది. చిన్నపిల్లలు పెద్దవారు ప్రతి ఒక్కరూ పెరుగు అన్నం వేసవికాలంలో తప్పకుండా తినాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు సూచనలు చేస్తున్నారు.
Telangana: తెలంగాణ ను అప్పుల కుంపటిలో పెట్టబోతున్న కాంగ్రెస్.. రాబోయే మూడు నెలల్లో వేలకోట్ల ఋణం!!