Hugging: ఒక్క కౌగిలింత.. 100 లాభాలు..!
Hugging: నేటి కాలంలో చాలామంది బిజీ లైఫ్ కారణంగా పిల్లలతో సమయాన్ని గడపలేకపోతున్నారు. దానివల్ల పిల్లలకు ఏదో తీరని బాధ అలానే మిగిలిపోతుంది. పిల్లలతో ప్రత్యేకించి సమయాన్ని గడపాలి. దానివల్ల వారి మనసు ఎంతో హాయిగా ఉంటుంది. పిల్లలతో సమయాన్ని గడపలేక పోయినట్లయితే వారికి అనేక రకాల సమస్యలు వస్తాయి. పిల్లలను దూరం పెట్టినట్లయితే కలిగే ప్రభావాలు ఏంటో చూద్దాం.

Benefits of Hugging for Mental Health
పిల్లలు ప్రతి ఒక్క విషయాన్ని స్వయంగా చెప్పడానికి ఇష్టపడతారు. సహాయం అడగకుండా ఉంటారు. ఎవరైనా పిల్లలను తాకినట్లయితే వారు అసౌకర్యంగా ఫీలవుతారు. కౌగిలింతలు ఇవ్వడానికి స్వీకరించడానికి ఇబ్బంది పడతారు. వారు తమ ఒంటరి సమయాన్ని చాలా విలువైనదిగా భావిస్తారు. పిల్లలు ఎక్కువగా వారిని వారు అనుమానించుకుంటారు. అభద్రత భావాన్ని కలిగి ఉంటారు. పిల్లలు ఇతరులను ఆకట్టుకోవడానికి ఇష్టపడతారు.
ఇతరులు తమను ఇష్టపడేలా చేయడానికి తమ వంతు కృషి చేస్తారు. ముఖ్యంగా ఇతర వ్యక్తుల కన్నా పిల్లలు తల్లిదండ్రులతో ఎక్కువగా సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. అందువల్ల ప్రతి ఒక్కరూ పిల్లలతో వీలైనంత సమయాన్ని గడపాలి. వారిని బయటకు తీసుకెళ్లాలి పిల్లలకు ప్రేమను పంచాలి. అలా చేసినట్లయితే వారి మెదడు చురుకుగా ఉంటుంది. పిల్లలు చాలా యాక్టివ్ గా తయారవుతారు. ఎలాంటి లోపాలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారని వైద్యుల నివేదికలో వెల్లడయింది.