Milk: పాలల్లో ఖర్జురా వేసుకుని తాగితే..ఇక పండగే ?
Milk: పాలలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ప్రతిరోజు ఒక గ్లాసుడు పాలు తాగినట్లయితే శరీరానికి కావలసిన పోషకాలు, విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా చేకూరుతాయి. అయితే ఒక గ్లాసుడు పాలతో పాటు ఖర్జూరాన్ని కూడా కలిపి తిన్నట్లయితే ఎన్నో రకాల ఆహార ఆరోగ్య ప్రయోజనాలు కోరుతాయని వైద్యులు సూచనలు చేస్తున్నారు. పాలు, ఖర్జూరం కలిపి తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఐరన్, పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం, ప్రోటీన్, ఫాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. పాలు, ఖర్జూరం రెండూ కూడా మంచి పోషకాహారం.

Benefits of Mixing Dates with Milk
ఈ రెండింటిని కలిపి తీసుకోవడం చాలా మంచిది. మరిగిన పాలలో ఖర్జూరం వేసుకొని తిన్నట్లయితే చాలా మంచిది. ఖర్జూరంలో భాస్వరం, పాలలో కాల్షియం అధికంగా ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకున్నట్లయితే ఎముకలు బలంగా, దృఢంగా ఆరోగ్యంగా తయారవుతాయి. ఎముకల వ్యాధులు తొలగిపోతాయి. ఖర్జూరంలో చక్కెర అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. మరిగిన పాలలో ఖర్జూరాన్ని కలిపి తీసుకున్నట్లయితే అలసట, నీరసం తొలగిపోతాయి. ఖర్జూరంలో మెగ్నీషియం, పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల నాడి వ్యవస్థ బలపడుతుంది.
Also Read: Fennel Seeds: తిన్న తర్వాత వెంటనే సోంపు వేసుకుంటున్నారా…అయితే జాగ్రత్త ?
ఇది నిద్రకు ఎంతగానో సహాయం చేస్తుంది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో రెండు మూడు ఖర్జూరాలను వేసి కలిపి తీసుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. దీనిని ఉదయం సమయంలో కూడా తీసుకోవచ్చు లేదా సాయంత్రం ఏ సమయంలోనైనా సరే వీటిని కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. చిన్న పిల్లలకు కూడా ఖర్జూరం, పాలు కలిపి తాగించినట్లయితే వారి ఎదుగుదల చాలా బాగుంటుంది. శరీరంలో ఏర్పడే లోపాలు తొలగిపోతాయి. చురుగ్గా, బలంగా తయారవుతారు. చిన్నపిల్లలు పాలు తాగడానికి అస్సలు ఇష్టపడరు. అలాంటివారికి పాలలో రెండు మూడు ఖర్జూరాలను వేసి కాసేపు మరిగించినట్లయితే రుచి మారుతుంది. ఆ మరిగిన పాలను తాగడానికి పిల్లలు చాలా ఇష్టపడతారు.
Bananas: ఎండా కాలం అరటి పండ్లు తింటున్నారా…?