BGT 2024: నెట్స్ లో గాయం… బాక్సింగ్ డే టెస్ట్ ముంగిట భారత్ కి పెద్ద ఎదురుదెబ్బ!!
BGT 2024: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మోకాలికి గాయం కావడంతో నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఆడటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో రోహిత్ శర్మ ఇప్పటివరకు ఆశించినంత ఫామ్‌ను ప్రదర్శించలేకపోయారు. న్యూజిలాండ్‌తో జరిగిన గత టెస్ట్ సిరీస్‌లో ఆయనకు నిరాశజనకమైన ఫామ్ ఉండగా, ప్రస్తుతం ఈ సిరీస్‌లో కూడా అతనికి మంచి ప్రదర్శన చూపించలేకపోయాడు.
BGT 2024 Rohit Sharma Facing Fitness Issues
ఈ నేపథ్యంలో, రోహిత్ శర్మ నాలుగో టెస్ట్‌కు ముందు నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో మోకాలికి గాయం కాగా, ఇప్పుడు ఆయన గాయానికి చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది. ఫిజియోథెరపిస్ట్ ద్వారా చికిత్స అందుకుంటున్న రోహిత్ శర్మ యొక్క గాయానికి ఎంత తీవ్రత ఉందో ఇంకా తెలియాల్సి ఉంది. అతను ఈ మ్యాచ్‌లో ఆడతాడో లేదో అనేది మరికొద్ది రోజుల్లో స్పష్టంగా తెలిసిపోతుంది.
రోహిత్ శర్మ నాలుగో టెస్ట్‌లో పాల్గొనకపోతే, భారత జట్టుకు ఇది పెద్ద నష్టం అవుతుంది. ఎందుకంటే, రోహిత్ శర్మ జట్టుకు అనుభవం మరియు స్థిరత్వం అందించగలిగిన కీలక ఆటగాడు. అతను గాయం కారణంగా ఆడకపోతే, సర్ఫరాజ్ ఖాన్‌కి అవకాశాలు లభించవచ్చు. అయితే భారత జట్టుకు మరో ఎదురుదెబ్బ తగులుతుందా అంటే అవుననే అంటున్నారు. ఈ సిరీస్‌లో రాహుల్ మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ, నెట్స్‌లో ఆయన కూడా గాయం చెందిన విషయం బయటపడింది. రాహుల్ కూడా నాలుగో టెస్ట్‌లో ఆడతాడా అంటే అనుమానంగానే ఉంది. ఈ ఇద్దరు కీలక ఆటగాళ్లు గాయపడటం, భారత జట్టుకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి.
భారత జట్టు ఇద్దరు ముఖ్యమైన ఆటగాళ్ళు గాయపడడం, ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌ను ఎలా ఉంటుందో అనేది ఆసక్తికరంగా మారింది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లేకుండా, జట్టు ఫామ్ మరియు ప్రదర్శన పై ప్రభావం పడుతుందనే సందేహాలు ఉన్నాయి.