Bharateeyudu 2 Movie Review and Rating

నటీనటులు: కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, సముద్ర ఖని, బాబీ సింహా, నెడుముడి వేణు, ప్రియా భావాన్ని శంకర్,ఎస్ జె సూర్య తదితరులు (Bharateeyudu 2)
సినిమాటోగ్రఫీ: రవి వర్మన్
ఎడిటింగ్ : ఏ. శ్రీకర్ ప్రసాద్
మ్యూజిక్ : అనిరుధ్ రవిచందర్
నిర్మాత : సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్
దర్శకత్వం : ఎన్.శంకర్
విడుదల తేదీ : 12 జులై 2024

Bharateeyudu 2 Movie Review and Rating

కమల్ హాసన్ హీరో గా నటించిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఆ క్లాసిక్ సినిమా కు సీక్వెల్ అనగానే ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ నేపథ్యంలోనే ఎంతో ఆర్భాటంగా మొదలైన ఈ సినిమా కి మేకింగ్ సమయంలోనే ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ సినిమా ఇప్పుడు విడుదల కు నోచుకోగా ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

కథ: దేశంలో లంచగొండితనం వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలను చూసి భారతీయుడు (కమల్ హాసన్) మళ్ళీ రావాలని బలంగా కోరుకున్నాడు చిత్ర (సిద్ధార్థ్). అందుకోసం సోషల్ మీడియా లో తన స్నేహితులతో కలిసి #comebackindian అనే ట్యాగ్ తో ట్రెండ్ చేస్తాడు. అలా ఒకరిద్వారా భారతీయుడు ఆచూకీ తెలుస్తుంది. దేశంలోని పరిస్థులను గమనిస్తున్న భారతీయుడు తాను ఇండియా కి రావడానికి ఇదే సరైన సమయం అని భావించి వస్తాడు. అక్కడ అవినీతి భారీగా చేస్తున్న పెద్దవారిని వారిని చంపేస్తుంటాడు. ఈ క్రమంలోనే దేశంలోని యువతని రెచ్చగొడుతున్నాడని ఆయనపై అందరు ఆరోపణలు చేసి దేశం నుంచి తరిమేయాలని ప్రజలందరూ నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత భారతీయుడు ఏం చేస్తాడనేదే ఈ సినిమా కథ.

Also Read: Boney Kapoor-Sridevi: పాపం.. ఆ సినిమా బోనీ కపూర్-శ్రీదేవి లను విడదీసిందని మీకు తెలుసా..?

నటీనటులు: దాదాపు 70 ఏళ్ల వయసులో కూడా కమల్ హాసన్ “భారతీయుడు 2″లో ఆకట్టుకునేలా కనిపించాడు.ఈ సినిమా కోసం కమల్ వేసుకున్న ప్రోస్తెటిక్స్ మేక్ అప్ చాలా బాగుంది. ఈ సినిమాలో ఆయన దాదాపు 6 రకాల గెటప్స్ తో కనిపించాడు. ప్రతి ఒక్కటి కూడా బాగుంది. నటన విషయంలో వేలుపెట్టనవసరం లేదు. ఈ పాత్ర తర్వాత సినిమాలో ఆకట్టుకున్న మరో పాత్ర సిద్ధార్థ్ చేసిన చిత్ర పాత్ర. ఈ పాత్ర ఆకట్టుకోవడంతో పాటు ప్రేక్షకులపై మంచి ప్రభావం చూపుతుంది. ఒకరకంగా కమల్ తర్వాత సిద్ధార్థ్ పాత్రనే చాలా బాగుంది. ఇక ఈ సినిమా లో హీరోయిన్ గా నటించిన రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర కి పెద్ద ప్రాధాన్యత లేదు. ఆమెది చాలా చిన్న పాత్ర. మరో హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ కి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇచ్చినా క్యారెక్టర్ పెద్దగా పండలేదు. సముద్ర ఖని, బాబీ సింహా, ఎస్ జె సూర్య లు పర్వాలేదనిపించారు.

సాంకేతిక నిపుణులు: దర్శకుడు శంకర్ సమకాలీన సంఘటనల ఆధారంగా కథ రూపొందించినప్పటికీ, వాటిలో కొత్తదనం లేదనే చెప్పాలి. ఈ సినిమా లో భారతీయుడు ఫీల్ అస్సలు ఉండదు. స్క్రిప్ట్‌కి చాలా రెగ్యులర్. సన్నివేశాలు కూడా చాలా బోర్ కొట్టిస్తాయి. అన్ని సినిమాల మాదిరిగానే దేశంలోని అవినీతి రాజకీయ నాయకులను బయటపెట్టడానికి సీన్స్ రాశాడు. కానీ కొన్ని సీన్స్ బాగున్నాయి. అవినీతిపై భారతీయులు ఎలా స్పందిస్తారనేది కొత్తగా చూపించాడు. కథను కావాలనే పొడిగించినట్లు ఉంటుంది. స్క్రీన్ ప్లే నిరాశ పరిచింది. అనిరుధ్ సంగీతం ఫర్వాలేదు. అక్కడక్కడా మెరుపులు తప్పా సంగీతం సినిమా కు ఉపయోగపడలేదు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటింగ్ విభాగం ఇంకాస్త పనిచేయాల్సి ఉంది. ఇకపోతే లైకా సంస్థ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:

కమల్ హాసన్

సినిమాటోగ్రఫీ

ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ పాయింట్స్:

అవుట్ డేటెడ్ సీన్స్

మ్యూజిక్

స్క్రీన్ ప్లే

తీర్పు:

ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తి స్థాయిలో అలరించలేకపోయింది. కొన్ని చోట్ల మెరుపులు తప్పా ఎక్కువ చోట్ల నిరాశే మిగిలిస్తుంది. శంకర్ మేజిక్ ఎక్కడా కనిపించలేదు. కమల్ హాసన్ మార్క్ సినిమా ఇది.ఓ భారీ క్లాసిక్ సినిమా కి సీక్వెల్ చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అది ఇంత పెద్ద డైరెక్టర్ శంకర్ మిస్ అవడం ఆశ్చర్యకరం.

రేటింగ్ : 2.5/5