Bhavana: వేరే హీరోతో ఎఫైర్..భర్తకు విడాకులు ఇవ్వబోతున్న శ్రీకాంత్ హీరోయిన్.?

Bhavana: సినిమా ఇండస్ట్రీలో చాలామంది జంటలు పెళ్లిళ్లు చేసుకొని పిల్లల్ని కన్నాక విడాకుల బాటపడుతున్నారు. ఇక ఈ మధ్యకాలంలో ఇదొక ట్రెండ్ గా మారిపోయింది. అలాంటి ఈ తరుణంలో మరో ఫేమస్ జంట కూడా ఇండస్ట్రీలో విడాకులు తీసుకోబోతున్నారని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వారు ఎవరు వివరాలు చూద్దాం.తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు తన నటన అభినయంతో మంచి గుర్తింపు పొందింది. శ్రీకాంత్ కు జోడిగా నటించి అద్భుతమైన క్రేజ్ సంపాదించుకుంది.
Bhavana is going to divorce her husband
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే భావన..తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహాత్మా అనే చిత్రంలో శ్రీకాంత్ కు జోడిగా నటించింది. ఈ సినిమాలో నీలపూరి గాజుల ఓ నీలవేణి అనే పాటతో భావన యూత్ లో మంచి ఫాలోయింగ్ పెంచుకుంది. ఇక ఈమె తెలుగు కంటే ఎక్కువ మలయాళ ఇండస్ట్రీలోనే సినిమాలు చేసిందని చెప్పవచ్చు. అలా తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, ఇండస్ట్రీలలో పలు చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న భావన ఆ తర్వాత పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. (Bhavana)
Also Read: Puri Jagannadh: పూరి జగన్నాథ్ కెరీర్ ఇలాగే నాశనమౌతుందని ముందే చెప్పిన నటి..?
తాజాగా భావన తన భర్తకు విడాకులు ఇవ్వబోతుందంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కన్నడ నిర్మాత అయినటువంటి నవీన్ ను ఆమె ప్రేమ వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. 2018లో ఒకటైన ఈ జంట అప్పటినుంచి ఇప్పటివరకు చాలా ఆనందంగా జీవిస్తున్నారు. అలాంటి వీరికి కాపురంలో కాస్త కలతలు వచ్చాయని దీంతో ఇద్దరు విడాకుల బాట పట్టారని తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో, అబద్దం ఉందో తెలియదు కానీ విడాకుల వార్తలు నెట్టింటా విపరీతంగా చక్కర్లు కొట్టడంతో భావన స్పందించింది..

వెంటనే తన భర్తతో కలిసి ఉన్నటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ, మా పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం నాకు అసలు ఇష్టం ఉండదు, కానీ మీరు మేం విడిపోతున్నామని వార్తలు రాసుకోస్తున్నారు అందులో ఏమాత్రం నిజం లేదు అవన్నీ ఉట్టి ప్రచారాలే అంటూ కొట్టి పడేసింది. మేము మా జీవితంలో చాలా హ్యాపీగా జీవిస్తున్నాం ఇప్పటికైనా ఇలాంటి రూమర్స్ ఆపేయండి అంటూ సోషల్ మీడియాలో రూమర్లు క్రియేట్ చేసిన ఆకతాయిలకు కౌంటర్ ఇచ్చింది..(Bhavana)
https://www.instagram.com/p/DD_Vii8SkjO/?utm_source=ig_web_copy_link