Satna Titus: డిస్ట్రిబ్యూటర్ తో ప్రేమ.. బిచ్చగాడు మూవీ హీరోయిన్ సంచలనం..?
Satna Titus: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని అంటే తెలియని వారు ఉండరు.. ఆయన ఏ సినిమాలో నటించిన ఆ చిత్రం సంచలనమే సృష్టిస్తుంది. ప్రతి సినిమాలో సమాజానికి ఏదో ఒక మెసేజ్ ఇచ్చే కథతో మన ముందుకు వచ్చి మంచి హిట్ అందుకుంటారు విజయ్ ఆంటోని. ఇలా భిన్నమైన సినిమాలు చేస్తూ విభిన్నమైన ప్రేక్షకులను తన సొంతం చేసుకున్నారాయన.. ఆయన కేవలం హీరో గానే కాకుండా నిర్మాతగా, సంగీత దర్శకుడిగా, గాయకుడిగా ఇలా ఆల్ రౌండర్ నటుడిగా చేస్తూ మంచి ఫామ్ లో ఉన్నారు..
Bicchagadu movie heroine Satna Titus Marraige
అలాంటి విజయ్ ఆంటోనీ కెరియర్ లో ది బెస్ట్ చిత్రం ఏంటయ్యా అంటే బిచ్చగాడు అని చెప్పవచ్చు. ఇది కేవలం తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగులోకి కూడా అనువాదం చేయగానే ఇక్కడి సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని అద్భుతమైన హిట్ అయింది.. అలా బిచ్చగాడు తెలుగు వెర్షన్ విజయ్ ఆంటోనీ సరసన సాట్న టైటాస్ హీరోయిన్ గా చేసింది.. మొదటి చిత్రంతోనే తన అందం, అభినయంతో ప్రేక్షకులకు దగ్గర అయింది. (Satna Titus)
Also Read: Kiran Abbavaram: పాన్ ఇండియా హిట్ తో రెమ్యూనరేషన్ భారీగా పెంచిన కిరణ్ అబ్బవరం..?
ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఆ తర్వాత నీది నాది ఒకే కథ, ఇతావన్, తిరిదుర కూటం వంటి చిత్రాల్లో నటించి మరింత మంది అభిమానులను సంపాదించుకుంది. అలా కెరియర్ లో కొనసాగుతున్న తరుణంలోనే ఈ చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్ గా చేసినటువంటి ఒక వ్యక్తికి దగ్గర అయింది. చివరికి ఆయనే ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఇంతకీ ఆ డిస్ట్రిబ్యూటర్ ఎవరయ్యా అంటే కార్తీ.. ఈయన తమిళంలో బిచ్చగాడు సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన సమయంలో వీరి మధ్య పరిచయం ఏర్పడింది.
అది కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారి తీయడంతో ఇద్దరు కలిసి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.. వీరి పెళ్లి సమయంలో ఇరు కుటుంబీకుల మధ్య కాస్త గొడవలు జరిగిన ఆ తర్వాత ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఈ దంపతులకు ఒక బాబు కూడా పుట్టాడు. ఎప్పుడైతే డిస్ట్రిబ్యూటర్ ను పెళ్లి చేసుకుందో అప్పటినుంచి సినిమాలకు దూరమైంది. ఫ్యామిలీ పిల్లలను చూసుకుంటూ ఉంటుంది. అలాంటి ఈమె సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది..(Satna Titus)