Sri Sathya: అందరూ చిన్న గా ఉందంటున్నారు..అందుకే సర్జరీ తప్పలేదు.. బిగ్ బాస్ ఫేమ్!!


Sri Sathya: తెలుగు నటి శ్రీ సత్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. “నిన్నే పెళ్లాడుతా”, “అత్తారింట్లో అక్కాచెల్లెలు”, “త్రినయని” వంటి సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులను అలరించింది ఈ అందాల తార. కొన్ని షార్ట్ ఫిల్మ్‌లలో కనిపించిన శ్రీ సత్య బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. దాదాపు 103 రోజులు ఈ ఇంట్లో గడిపింది. శ్రీ సత్య బిగ్ బాస్ షో ద్వారా తెలుగు వారందరికీ బాగా దగ్గరైంది. అయితే ఇంతటి ఫేమస్ అయినా కూడా ఆమెకు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. అందుకే ప్రస్తుతం పలు టీవీ డ్యాన్స్ షోలతో బిజీగా ఉంది. మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ తో కలిసి ప్రైవేట్ ఆల్బమ్ కూడా చేస్తుంది.

Big Boss fame Sri Sathya Comments on Dance Show

Big Boss fame Sri Sathya Comments on Dance Show

వీటికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇదిలా ఉంటే సిద్ధు జొన్నల గడ్డ నటించిన తాజా హిట్ చిత్రం టిల్లు స్క్వేర్ లో ఆమె సందడి చేసింది.. కానీ ఆమె తెరపై కనిపించిన సమయం చాలా తక్కువ. ఈ నేపధ్యంలో తాజాగా శ్రీ సత్య ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత మరియు సినీ జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. టిల్లు స్క్వేర్ లో కొద్ది సేపే కనిపించాను. సినిమా నిడివి ఎక్కువైనా కారణంగా నేను నటించిన సన్నివేశాలను కట్ చేశారని చెప్పుకొచ్చింది.

Also Read: Simran: స్టార్ హీరోయిన్ కావాల్సిన సిమ్రాన్ సోదరి అలా అవడానికి కారణం ఆ హీరో నా!!

గతంలో అవకాశాల కోసం చాలా ప్రయత్నించాను. అప్ఈపుడు నా మొహం చాలా చిన్న గా కనిపిస్తుంది అనేవారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అని ఆలోచిస్తున్నప్పుడు, లిప్ ఫిల్లర్లు ట్రై చేశాను. మూడు నాలుగు నెలల పాటు తాత్కాలికంగా ఈ లిప్ ఫిల్లర్స్ ట్రై చేశాను. అయితే ఇప్పుడు చాలా మంది అప్పుడున్న లుక్ బాగుందని అంటున్నారు. మరోవైపు సినిమావాళ్ళు మెచ్యూర్డ్‌గా కనిపిస్తున్నావు అన్నారు. నేను డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లో ఎవరితో కలిసి డ్యాన్స్ చేసినా సంబంధం అంటకడుతున్నారు. సోషల్ మీడియాలో నీచమైన కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. ఎందుకంటే వృత్తిపరమైన విధానం వ్యక్తిగత విధానానికి భిన్నంగా ఉంటుంది.అన్నారు శ్రీ సత్య.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *