Phones: బాత్రూంలోకి ఫోన్ తీసుకు వెళ్లే వారికి బిగ్ షాక్?
Phones: మొబైల్ ఫోన్ వాడకం నేటి కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్ వాడుతున్నారు. ఇక సోషల్ మీడియా కాలం వచ్చినా అనంతరం ఫోన్ విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారు. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేంతవరకు ఫోన్ మాయ లోకం లోనే పడిపోతున్నారు. ఫోన్ లేకపోతే కనీసం ముద్ద కూడా దిగడం లేదు. ఫోన్ లేకపోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది. ఇక మరి కొంతమంది ఇంట్లో బయట ఎక్కడికి వెళ్లినా సరే ఫోన్ వాడుతూ ఉంటారు.

Big shock for those who take their phones to the bathroom
తినే సమయంలో పడుకునే ముందు కూడా ఫోన్ వాడుతూ ఉంటారు. మరి కొంతమంది మాత్రం బాత్రూం లోకి ఫోన్ తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇలా బాత్రూంలోకి ఫోన్ తీసుకొని వెళ్లి అక్కడ రీల్స్ చూడడం ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు. అయితే బాత్రూంలోకి మొబైల్ ఫోన్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని వైద్యులు సూచనలు చేస్తున్నారు. మొబైల్ ఫోన్ బాత్రూంలో వాడడం వల్ల ఫోన్ లోకి ప్రమాదకరమైన బ్యాక్టీరియా చేరుతుంది. అనంతరం ఆ ఫోన్ ని ఇంట్లోకి తీసుకువెళ్లి పెట్టడం వల్ల ఆ బాక్టీరియా ఇంట్లో వ్యాపించి ప్రాణాంతక వ్యాధులను సంభవించేలా చేస్తుంది.
Mokshagna: మోక్షజ్ఞ విషయంలో ఆ జ్యోతిష్యుడు చెప్పిందే కరెక్టా.. బాలకృష్ణ తప్పు చేస్తున్నారా.?
బాత్రూంలో ఫోన్ వాడుతున్నప్పుడు పూర్తి శ్రద్ధ ఫోన్ మీదే ఉంటుంది. దానివల్ల బాత్రూంలో ఎక్కువ సమయం గడపడం వల్ల బ్యాక్టీరియా మన నోట్లోకి ప్రవేశిస్తుంది. దానివల్ల శరీరంలో భయంకరమైన వ్యాధులు సంభవించే అవకాశం ఉంటుంది. కొంతమంది ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు. అప్పుడు వారు తప్పకుండా ఫోన్ పట్టుకుంటారు. అలా బాత్రూంకి తీసుకెళ్లిన ఫోన్ ని చిన్న పిల్లలకు ఇవ్వడం వల్ల ఆ బాక్టీరియా ప్రభావం చిన్నపిల్లలపై విపరీతంగా పడుతుంది. దానివల్ల చిన్న పిల్లల ఎదుగుదలలో అనేక లోపాలు తలెత్తుతాయి. ఫోన్ ప్రభావం చిన్నపిల్లల మెదడుపై విపరీతంగా పడుతుంది. అంతేకాకుండా చిన్న పిల్లలలో ఆకలి లేకపోవడం, అనారోగ్య సమస్యలు విపరీతంగా తయారవుతాయి. ఇకనుంచి అయినా బాత్రూమ్ లోకి ఫోన్ తీసుకువెళ్లే అలవాటు ఉన్నట్లయితే వారు మార్చుకోవడం మంచిది.
Hanuman Jayanti: ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి.. ఏప్రిల్ 8 నుండి ఈ పని చేస్తే ఏ కోరికైనా క్షణాల్లో.?