Savitri: పెళ్ళైన మగాడిపై మోజు పడిందంటూ సావిత్రిపై బిగ్ బాస్ కంటెస్టెంట్ ఫైర్.?

Savitri: బిగ్ బాస్ ఈ షోను ఎవరు కనిపెట్టారో ఏమో కానీ ఇది మొదలై ఇప్పటికే ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రతి సీజన్ లో ఎంతో మంది కంటెస్టెంట్లు ఇందులోకి వచ్చి ఫేమస్ అయి సినిమాల్లో రాణిస్తున్నారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గీత్ రాయల్.. ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి తన పర్ఫామెన్స్ ఏంటో చూపించింది. అలాంటి గీతు రాయల్ ఇప్పుడు ఏదో ఒక వివాదంలో తలదూరుస్తూనే ఉంటుంది.
Bigg Boss contestant fires at Savitri
తాజాగా ఈమె మహానటి సావిత్రి గురించి చేసిన కామెంట్స్ తీవ్ర వివాదానికి దారి తీసాయి. సావిత్రిని ఆమె ఏమన్నది వివరాలు చూద్దాం.. మహానటి సావిత్రి ఎంతో గొప్పది.. ఆమె గురించి మాట్లాడే అర్హత నాకు లేదు కానీ ఆమె చేసిన ఒక తప్పు గురించి మాత్రం తప్పకుండా చెప్పుకోవాలి.. సాధారణంగా ప్రేమలో ఉన్న, పెళ్లి అయిన వారి జోలికి పోకూడదు. కానీ మహానటి సినిమా చూసినప్పుడు సావిత్రమ్మ తప్పు చేసింది అనిపించింది.(Savitri)
Also Read: Anjali: ఆ హీరోతో ప్రేమలో మునిగి తేలుతున్న అంజలి..?
అప్పటికే పెళ్లి అయి పిల్లలున్నటువంటి జెమినీ గణేషన్ ను ఆమె ప్రేమించింది. చివరికి పెళ్లి కూడా చేసుకుంది.. అలాంటి జెమినీ గణేషన్ పెళ్లి తర్వాత మరో అమ్మాయితో కనిపించడంతో సావిత్రి తట్టుకోలేకపోయింది. మరి సావిత్రి జెమినీ గణేషన్ ప్రేమలో పడ్డప్పుడు ఆయన భార్య ఎంత బాధపడి ఉంటుందో సావిత్రి ఆలోచించిందా అంటూ చెప్పుకొచ్చింది..

పెళ్లయిన ఇతరులపై మోజు పడే వ్యక్తులు మిమ్మల్ని కూడా వదిలి మరో అమ్మాయి దగ్గరికి వెళ్ళారని మీరు ఎలా ఊహిస్తారు. వాళ్ళ బుద్ధి అది, జాగ్రత్తగా ఉండండి అంటూ హితబోధ చేసింది. ఈ విధంగా సావిత్రి చేసిన తప్పు గురించి ఈమె సోషల్ మీడియా వేదికగా బయట పెట్టడంతో నేటిజన్స్ పలు విధాలుగా విమర్శిస్తున్నారు. ఆమెను తప్పు అని చెప్పే రేంజ్ నీకు లేదని కామెంట్లు పెడుతున్నారు.(Savitri)