Adani: మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ కూటమిలో భారతీయ జనతా పార్టీ, ఏక్ నాథ్ షిండే వర్గం, అజిత్ పవార్ వర్గం ఉన్నాయి. ఈ మూడు పార్టీల కలయికతో గ్రాండ్ విక్టరీ నమోదు చేశాయి. దీంతో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ… ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. Adani

BJP alliance victory in Maharashtra a big relief for Adani

అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో బిజెపి కూటమి గెలవడంతో… అదాని గ్రూప్స్ కు భారీ ఊరట లభించినట్లు చెబుతున్నారు. మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయం సాధించడంతో ధారావి ప్రాంతం… అభివృద్ధి కోసం… అదాని గ్రూప్స్ డీల్ చేసుకున్న ఒప్పందం ఇకపై రద్దు అయ్యే ఛాన్సులు లేవు. మూడు బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని బిజెపి ప్రభుత్వంతో అధాని… కుదుర్చుకున్నారు. Adani

Also Read: Ys Sharmila: అదానీని తరిమికొట్టండి…రేవంత్ కు వైఎస్ షర్మిల హెచ్చరిక.. ?

అయితే ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే.. ధరవి అభివృద్ధి పైన అధాని కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తామని ప్రకటించింది. పేదల భూములను గుంజుకుంటే ఊరుకునేది లేదని అదానికి వార్నింగ్ ఇచ్చింది. కానీ మహారాష్ట్ర ప్రజలు మాత్రం బిజెపి కూటమికి పట్టం కట్టడంతో… అదానికి భారీ ఊరట లభించింది అని చెప్పవచ్చు. ఆ ప్రాజెక్ట్ యధావిధిగా కొనసాగనుంది. Adani