Parvesh Sahib Singh Verma: కేజ్రీవాల్ పై గెలిచిన పర్వేష్ ఆస్తులు ఎంతో తెలుసా ?


Parvesh Sahib Singh Verma: న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై గెలిచిన బిజెపి అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ వార్తల్లో నిలిచారు. బిజెపికి చెందిన పర్వేష్ మొత్తం సంపద రూ. 115 కోట్లకు పైగా ఉంటుందని ఎన్నికల్లో పేర్కొన్నారు. పర్వేష్ వర్మ అతని భార్యకు స్టాక్ మార్కెట్లో భారీ పెట్టబడులు పెట్టారు.

BJP candidate is Parvesh Sahib Singh Verma assets

వాటి విలువ రూ. 69 కోట్లకు పైనే ఉంది. గౌతమ్ ఆదాని నుండి అనిల్ అంబానీ కంపెనీల వరకు పర్వేష్ వర్మతో పాటు అతని భార్యకు రూ. 69 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. పర్వేష్ వర్మ తనకు మరియు తన మొత్తం కుటుంబానికి ఎల్ఐసి పాలసీ తీసుకున్నాడు. మొత్తం పెట్టుబడి రూ. 82.17 లక్షలు.

ఢిల్లీ బిజెపి ఎంఎల్ఏ గా గెలుపొందిన పర్వేష్ వర్మ అతని కుటుంబం వద్ద దాదాపు రూ. 85 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నాయి. పర్వేష్ వర్మ రూ. 4.56 కోట్ల విలువైన వ్యవసాయ భూమి, రూ. 8.30 కోట్ల విలువైన వ్యవసాయతర భూములు ఉన్నాయి. ఢిల్లీ ఎం ఎల్ పర్వేష్ వర్మకు రూ. 1.25 కోట్ల విలువైన ఇల్లు, ఐదు కోట్ల విలువైన కమర్షియల్ కాంప్లెక్స్ కలిగి ఉన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *