Raja Singh: టేబుల్ క్లీన్ చేసే వారికి మాత్రమే పదవులు?
Raja Singh: తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీలో ముసలం నెలకొంది. సొంత పార్టీ నేతలపైనే తాజాగా బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టేబుల్ తుడిచే వారికి మాత్రమే పదవులు కట్టబెడుతున్నారని మండిపడ్డారు రాజాసింగ్. తాజాగా సొంత పార్టీ పైన రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

BJP MLA Raja Singh’s controversial remarks
బిజెపి పార్టీలో ఉన్న పెద్ద అధికారి మేకప్ మ్యాన్ అంటూ హాట్ కామెంట్స్ చేశారు రాజా సింగ్. ఆయన టేబుల్ క్లీన్ చేస్తే వాళ్లకు పదవులు ఇప్పిస్తున్నారని ఆరోపణలు చేశారు. మిగతా నియోజకవర్గాలలోని కార్యకర్తలు ఎవరు కనిపించడం లేదా అంటూ నిలదీశారు.
Revanth Reddy: కమిటీ ఏర్పాటు హడావిడి నిర్ణయం.. రేవంత్ రెడ్డి ఆలోచనా తీరు ఇంత దారుణమా?
నేను చేస్తున్న శ్రీరామనవమి శోభాయాత్రకు తక్కువ మంది వచ్చేలా కొంతమంది బిజెపి నేతలు కుట్రలు చేస్తున్నారని కూడా మండిపడ్డారు. కావాలని అంబర్పేట నుంచి గౌతమ్ రావు శోభాయాత్ర నిర్వహిస్తున్నారని కూడా బాంబు పేల్చారు. అందుకే అతనికి టికెట్ ఇచ్చారని కూడా రాజాసింగ్ ఆరోపణలు చేయడం జరిగింది.
TDP Waqf support: ముస్లింలకు చంద్రబాబు వెన్నుపోటు.. వక్ఫ్ బిల్లుపై చంద్రబాబు మద్దతు పై షర్మిల!!