BJP Returns to Power: ఢిల్లీ కొత్త సీఎం ఎవరో.. ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కీలక పరిణామాలు!!


BJP Returns to Power in Delhi After 27 Years

BJP Returns to Power: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనే అనిశ్చితి కొద్ది గంటల్లో తేలనుంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు ప్రధాని మోదీ నివాసంలో సమావేశమై సీఎం అభ్యర్థిని ఖరారు చేసింది. అధికారిక ప్రకటన సాయంత్రం మీడియా సమావేశంలో విడుదల చేయనున్నారు. ఈ ప్రక్రియ తర్వాత, రాత్రి 7 గంటలకు శాసనసభాపక్ష సమావేశం నిర్వహించి, ఎమ్మెల్యేలు తమ నేతను ఎన్నుకోనున్నారు. ఎన్నికైన సీఎం లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలుసుకుని, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు.

BJP Returns to Power in Delhi After 27 Years

ఢిల్లీ సీఎం రేసులో ఎవరు ముందున్నారు?
న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మ ప్రధాన అభ్యర్థిగా ఉండే అవకాశం ఉంది. రేఖా గుప్తా, విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్, పవన్ శర్మ, అజయ్ మహావార్ పేర్లు కూడా సీఎం రేసులో ఉన్నారు. జాట్ సామాజిక వర్గానికి చెందిన పర్వేష్ వర్మకు అధిష్ఠానం మద్దతు ఇవ్వవచ్చని సమాచారం. బీజేపీ గెలిచిన ఎమ్మెల్యేల్లో 10 మంది జాట్ నేతలు ఉండటంతో, ఆయనకు అధిక అవకాశం ఉందని భావిస్తున్నారు.

ప్రమాణస్వీకార ఏర్పాట్లు పూర్తి స్థాయిలో
సీఎం ఎంపిక ప్రక్రియ పూర్తి కాకుండానే రామ్ లీలా మైదానంలో ప్రమాణస్వీకార ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రమాణస్వీకారం జరగనుంది. 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారం దక్కించుకోవడంతో, కార్యక్రమాన్ని భారీగా నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్డీఏ పాలిత 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 50 మందికి పైగా సినిమా తారలు, ప్రముఖ వ్యాపారవేత్తలు హాజరు కానున్నారు.

ఆధ్యాత్మిక నాయకులు మరియు రైతులు హాజరు
ఈ కార్యక్రమానికి బాబా రాందేవ్, స్వామి చిదానంద్, బాబా బాగేశ్వర్ వంటి ప్రము ఆధ్యాత్మిక నాయకులను ఆహ్వానించారు. రైతులు, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను కూడా హాజరుకావాలని బీజేపీ కోరింది. ముఖ్యమంత్రి పేరును ప్రకటించిన వెంటనే ఆయన కోసం భారీ స్వాగత ఏర్పాట్లు చేపట్టనున్నారు. ఈ నెల 8న ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించబడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *