Black pepper: భారతదేశంలో ప్రతి ఒక్కరి ఇంట్లో వంట గదిలో కనిపించే మసాలా దినుసులు మిరియాలు ఒకటి. ఇది ఆహారంలో రుచిని పెంచుతుంది. అంతేకాకుండా ఘాటుగా ఉంటుంది. అయితే మిరియాలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతిరోజు ఉదయం పాలలో చిటికెడు మిరియాల పొడి వేసుకొని మరిగించుకొని తాగినట్లయితే మన శరీరంలో వచ్చే అనేక రకాల జబ్బులు నయం అవుతాయి. Black pepper
black pepper health benefits
ముఖ్యంగా జలుబు, దగ్గు వంటి సమస్యలు ఒకేరోజు తగ్గిపోతాయి. జ్వరం వచ్చిన సమయంలో ఒక గ్లాసుడు నీటిలో మిరియాలు పొడి, కొద్దిగా పసుపు వేసుకొని మరిగించుకొని తాగినట్లయితే జ్వరం సులువుగా నయమవుతుంది. పూర్వకాలం నుంచి మిరియాలను ఆయుర్వేద ఔషధంగా వాడుతున్నారు. మిరియాలు శరీరంలో ఏర్పడే అనేక రకాల సమస్యలను దూరం చేసి శరీరాన్ని కాపాడుతుంది. Black pepper
Also Read: Virat Kohli: ఒకే టీమ్‌లో కోహ్లీ, బాబర్.. ఇక ఫాన్స్ కు పండగే ?
ముఖ్యంగా శరీరంలో ఏర్పడే అనేక రకాల ఇన్ఫెక్షన్లను మిరియాలు చాలా తక్కువ సమయంలో నయం చేస్తాయి. మసాలా దినుసులలో మిరియాలు చేసే సహాయం మరొక మసాలా దినుసు చేయదు అనేది పూర్వకాలం నుంచి వస్తున్న మాట. మిరియాలు ఆరోగ్యంతో పాటు చర్మ సమస్యలను కూడా తొలగిస్తాయి. ప్రతిరోజు మిరియాల పొడిని క్రమం తప్పకుండా వాడినట్లయితే చర్మానికి కూడా చాలా మంచిది. చర్మ సమస్యలను చాలావరకు మిరియాలు తొలగిస్తాయి. Black pepper