Prabhas: ప్రభాస్ పై మోజు పడుతున్న బోల్డ్ బ్యూటీ.. డేటింగ్ కావాలంటూ
Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆరడుగుల బుల్లెట్ ఎవరయ్యా అంటే చాలామందికి గుర్తుకువచ్చేది రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రమే.. ఈయన ఎంతో ఎత్తు ఉండడమే కాకుండా ఇండస్ట్రీలో కూడా ఎవరికి అందనంత స్థాయికి ఎదిగారు..అలాంటి ప్రభాస్ ను ఒకప్పుడు హీరోగా పనికిరాడు అన్నారు. కొంతమంది కించపరిచారు.. అయినా ప్రభాస్ పట్టించుకోకుండా తనదైన శైలిలో దూసుకెళ్లి పాన్ ఇండియా అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా మారారు.. తెలుగు సినిమా ఇండస్ట్రీని అతను ప్రపంచ దేశాల్లో తెలిసేలా చేశారు..

Bold beauty who is obsessed with Prabhas
అలాంటి యంగ్ రెబల్ స్టార్ ఎంతో హైట్ ఉంటారు కానీ, అమ్మాయిలను చూస్తే చాలా భయపడిపోతారట.. షూటింగ్ సెట్ లో హీరోయిన్లతో కానీ, ఇతర అమ్మాయిలతో కానీ కనీసం మాట్లాడడానికి కూడా సిగ్గుపడతారట.. అలాంటి ఆయనను హీరోయిన్ దారుణంగా ఆడుకొని షూటింగ్లోనే ఇబ్బందులకు గురిచేసిందట.. ఆ హీరోయిన్ ఎవరు వివరాలు చూద్దాం.. ప్రభాస్ నాలుగు పదుల వయసు దాటిన పెళ్లి విషయంలో మాత్రం మొహమాటపడుతూనే ఉన్నారు..(Prabhas)
Also Read: Mahesh Babu movie: మహేష్ ను ఇబ్బంది పెడుతున్న రాజమౌళి కండిషన్స్!!
కానీ ఆయనను చేసుకోవడానికి ఎంతో మంది హీరోయిన్లు కాచుకొని కూర్చున్నారు. ఈయనకు భార్య అయ్యే అదృష్టం ఎవరికి ఉందో తెలియదు.. కానీ ఈయన గురించి చాలా ఎఫైర్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. కానీ వీరందరిలోకెల్లా అనుష్క శెట్టితో వీరి రిలేషన్ చాలా ప్రత్యేకం.. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి.. కానీ పెళ్లి ముహూర్తం మాత్రం సెట్ అవ్వడం లేదు..

ఇక ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ యోగి సినిమా చేసే సమయంలో హీరోయిన్ ముమైత్ ఖాన్ ప్రభాస్ ను చాలా వరకు టీజింగ్ చేసిందట.. చివరికి భరించలేక ప్రభాస్ కొరియోగ్రాఫర్ కు కంప్లైంట్ చేశారట.. కానీ నేను వదలకుండా ప్రభాస్ ను అలాగే ఈవిటీజింగ్ చేశాను.. అలా మా ఇద్దరి మధ్య షూటింగ్ సెట్లో చాలా ఫన్ క్రియేట్ అయింది.. ఈ విధంగా ప్రభాస్ నేను మంచి స్నేహితులుగా మారిపోయామని అన్నది.. నిజంగా ప్రభాస్ డార్లింగ్ లాంటి వ్యక్తి.. నాకు డేటింగ్ చేసే అవకాశం వస్తే ముందుగా ప్రభాస్ తోనే డేట్ చేస్తానని ముమైత్ ఖాన్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Prabhas)