Sonu Sood Faces Case: సోనూ సూద్ అరెస్ట్ వారెంట్.. 10 లక్షల మోసం కేసులో కొత్త ట్విస్ట్!!

Sonu Sood Faces Case: ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కి లూథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. లూథియానాకు చెందిన లాయర్ రాజేష్ ఖన్నా ఫిర్యాదుతో ఈ వివాదం చెలరేగింది. మోహిత్ శుక్లా అనే వ్యక్తి తనను మోసం చేశాడని, రిజిస్ట్రేషన్ ఫీజు పేరుతో రూ. 10 లక్షలు కాజేశారని రాజేష్ ఖన్నా కోర్టులో కేసు నమోదు చేశారు. ఈ కేసులో సోనూ సూద్ కీలక సాక్షిగా ఉన్నప్పటికీ, విచారణకు హాజరు కాలేదు. దీంతో కోర్టు ఫిబ్రవరి 10వ తేదీలోపు హాజరయ్యేందుకు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
Bollywood Star Sonu Sood Faces Case
ఇటీవల సోనూ సూద్ “ఫతే” అనే బాలీవుడ్ చిత్రంలో నటించారు. అయితే, ఈ సినిమా వాణిజ్యపరంగా మోస్తరు వసూళ్లు మాత్రమే సాధించింది. విలన్ నుండి హీరోగా మారిన తర్వాత ఆయన సినిమాల్లో ఆఫర్లు తగ్గిపోయాయనే ప్రచారం ఉంది. కరోనా సమయంలో ఇండియన్ సూపర్ హీరోగా పేరు తెచ్చుకున్న సోనూ సూద్, ఆ తర్వాత కొంత క్రేజ్ కోల్పోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే, గతంలో సోనూ సూద్ చారిటీ పనులపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆయనకు అంత భారీ స్థాయిలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అనే ప్రశ్నలు కూడా పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో అరెస్ట్ వారెంట్ జారీ కావడం విశేషం. ఇప్పుడు ఆయన దీనిపై ఎలా స్పందిస్తారో, ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.