South heroines: టాలీవుడ్ హీరోయిన్ ల ధాటికి విలవిల లాడుతున్న బాలీవుడ్ హీరోయిన్ లు!!
South heroines: బాలీవుడ్‌లో సౌత్ హీరోయిన్ల ప్రభావం రోజురోజుకి పెరిగిపోతోంది. “ఇదంతా మనదే” అంటూ, బాలీవుడ్‌లో సౌత్ హీరోయిన్‌లు తమ స్థానాన్ని సుస్థిరం కృషి చేస్తున్నారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫేమస్ అయిన వారు బాలీవుడ్‌లో కూడా తమ మార్కును సెట్ చేయాలని చూస్తున్నారు.
Bollywood success of South heroines
రష్మిక మందన ఇప్పటికే బాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందింది. ఆమె ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. తన అందం మరియు నటనతో రష్మిక బాలీవుడ్‌లో నేషనల్ క్రష్‌గా ముద్ర వేసుకుంది. సాయి పల్లవి కూడా బాలీవుడ్‌లో తన స్థానాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తుంది. హిందీ ప్రేక్షకులకు కూడా తన శైలితో దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. రామాయణ్‌లో సీతగా ఆమె నటిస్తున్నది. ఈ సినిమాతో సాయి పల్లవి బాలీవుడ్‌లో మరింత గుర్తింపు పొందే అవకాశం ఉంది. “రామాయణ్” రెండు భాగాల్లో విడుదల కానుంది, ఇందులో యష్ రావణుడిగా కనిపించనున్నాడు.
సమంత, తమన్నా వంటి స్టార్ హీరోయిన్లకు కూడా బాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం ఉంది. సమంత “సిటాడెల్”, ఫ్యామిలీ మెన్ వంటి సిరీస్ లతో గుర్తింపు పొందగా ఇప్పుడు మరిన్ని బాలీవుడ్ సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి, ఇటు తమన్నా కూడా హిందీ సినిమాల్లో ఎక్కువగా నటిస్తోంది. మొత్తానికి, సౌత్ బ్యూటీస్ బాలీవుడ్‌లో మంచి హవా సాధించి, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని ప్రపంచ స్థాయిలో గుర్తుంచేలా చేస్తున్నారు.