Bottle Gourd: సొరకాయ తింటున్నారా.. అయితే డేంజర్ లో పడ్డట్టే ?
Bottle Gourd: సొరకాయ తినడానికి చాలామంది ఇష్టపడరు. కానీ సొరకాయలో మన శరీరానికి కావాల్సినన్ని పోషకాలు ఉంటాయి. దీనిని మనం చాలా రకాలుగా తినవచ్చు. అన్ని సీజన్లలో లభించే కూరగాయలలో సొరకాయ ఒకటి. ఈ కూరగాయ మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. ఈ సొరకాయలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల విటమిన్లు ఉంటాయి.
Bottle Gourd Facts, Benefits, Grow and Care Tips
దీనిని మనం జ్యూస్ రూపంలో లేదా కూర రూపంలో అయినా తీసుకోవచ్చు. సొరకాయలో దాదాపు 92 శాతం నీరు ఉంటుంది. మన శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ముఖ్యంగా ఎండాకాలంలో మన శరీరానికి వేడి చేయదు. సొరకాయలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. మలబద్ధకం సమస్యను తొలగిస్తోంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది.
సొరకాయలో అధిక నీటి శాతం, సమ్మేళనాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నందువల్ల సొరకాయ చర్మం ఆరోగ్యానికి, జుట్టుకు చాలా మంచిది. రక్త శుద్ధి, శరీరం నుండి అవాంఛనీయ కణాలను తొలగించడం ద్వారా సొరకాయ శరీరంలో సహజ సిద్ధంగా పనిచేస్తుంది. ఇది జుట్టు నాణ్యతను మెరుగు పరుస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీరంలోని వ్యర్ధాలను తొలగించడానికి ఎంతగానో సహాయం చేస్తుంది. సొరకాయతో చర్మం అందంగా తయారవుతుంది.