Bunny: బన్నీ త్రివిక్రమ్ మూవీలో హీరోయిన్ ఫిక్స్.. హాట్ హీరోయిన్ నే పట్టేసారుగా..?
Bunny: ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులు హీరోల కాంబినేషన్లు తరచూ రిపీట్ అవుతూ ఉంటాయి. దీనికి ప్రధాన కారణం అలా వారి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అవుతాయి కాబట్టి తరచూ రిపీట్ చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో ఆ స్టార్ హీరో ఆ స్టార్ దర్శకుడి సినిమాలు తరచూ రిపీట్ అవుతూ ఉన్నాయి. ఇంతకీ వారు ఎవరయ్యా అంటే మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. వీరిద్దరి కాంబినేషన్ అంటే ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడతారు.
Bunny Trivikram Movie Heroine Fix
వీరి కాంబోలో వచ్చిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా, రికార్డులు బద్దలు కొట్టాయి. అలాంటి వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతోంది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. ఇప్పటికే వీరి కాంబోలో అల వైకుంఠపురం, సన్నాఫ్ సత్యమూర్తి వంటి చిత్రాలు చేసి హిట్టు అందుకున్నారు. అయితే ఈ మాటల మాంత్రికుడు అల్లు అర్జున్ తో మరోసారి జత కట్టడానికి రెడీ అవుతున్నారు. (Bunny)
Also Read: Roja: రోజా కూతురు పెళ్లి ఫిక్స్.. ఆ బడా హీరో ఇంటికి కోడలుగా.?
ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో వీరి కాంబోలో ఎలాంటి సినిమా రాబోతుందని అభిమానులు కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఇదే తరుణంలో ఈ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ కు జతగా వచ్చే హీరోయిన్ ఎవరనేది కూడా ఆసక్తికరంగా మారింది. దీనిపై త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి ప్లాన్ చేసి మీనాక్షి చౌదరిని కథానాయికగా తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో మీనాక్షి చౌదరి లక్కీ భాస్కర్ అనే సినిమాతో మంచి గుర్తింపు పొందింది.
తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ ఇండస్ట్రీలో కూడా ఆమె సినిమాలు చేస్తూ బిజీగా మారింది. మీనాక్షి చౌదరి మార్కెట్ బాగుండడంతో అల్లు అర్జున్ సరసన నటిస్తే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని మార్కెట్ బాగుంటుందని త్రివిక్రమ్ ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. అందుకే ఆమెను హీరోయిన్ గా తీసుకుంటారని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇందులో రెండవ హీరోయిన్ కూడా ఉండబోతుందట. మరి ఆ ప్లేస్ లో ఎవరిని తీసుకుంటారనేది చాలా ఆసక్తికరంగా మారింది.(Bunny)