Cabbage: క్యాబేజీతో ఆల్జీమర్స్ వ్యాధికి చెక్ పెట్టేయచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే దీనిని తినడానికి చాలామంది ఇష్టపడరు. క్యాబేజీలో ఉండే విటమిన్స్, అయోడిన్, ఆంటీ యాక్సిడెంట్లు శరీరానికి పోషకాలను అందిస్తాయి. ముఖ్యంగా క్యాబేజీ శరీరంలో ఏర్పడే మంటను తగ్గించి శరీరం చల్లగా ఉండడానికి సహాయపడుతుంది. సల్పోరాఫేన్ అనే కణాలు ఇందులో ఉండడం వల్ల దీర్ఘకాలిక మంటను తగ్గిస్తాయి. Cabbage
Cabbage Health Benefits
ముఖ్యంగా క్యాబేజీ క్యాన్సర్ వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తాయి. క్యాబేజీకి క్యాన్సర్ నుంచి పోరాడే శక్తి ఉంటుంది. క్యాబేజీ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది. క్యాబేజీలో విటమిన్ కే, అయోడిన్, ఆంటీయాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడుకు ఎంతో మేలును కలిగిస్తాయి. ముఖ్యంగా క్యాబేజీ ఆల్జీమర్స్ రోగుల మెదడులో ఉండే చెడు ప్రోటీన్లను తగ్గించడానికి సహాయం చేస్తుంది. క్యాబేజీ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. క్యాబేజీలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. Cabbage
Also Read: IPL 2025: RCB లోకి అర్జున్ టెండూల్కర్..కోహ్లీ అదిరిపోయే స్కెచ్?
బరువు తగ్గాలనుకునే వారు చాలామంది క్యాబేజీ తినడానికి ఇష్టపడతారు. క్యాబేజీలో 70% వరకు నీరు ఉంటుంది. దీనిని తినడం వల్ల చాలా సేపు ఆకలి వేయదు. కడుపు నిండుగా ఉంటుంది. దానివల్ల సులభంగా బరువు తగ్గుతారు. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల ఆకలి అనిపించదు. క్యాబేజీతో చాలామంది పకోడా, క్యాబేజీ ఫ్రై, క్యాబేజీ సలాడ్ వివిధ రకాల వంటకాలలో వాడుతారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానూ క్యాబేజీ తినడం చాలా మంచిదని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. Cabbage