Cardamom: యాలకులు తింటున్నారా.. అయితే జాగ్రత్త ?
Cardamom: యాలకులు సువాసన, రుచి కోసం ఎంతోమంది వాడుతూ ఉంటారు. అయితే యాలకులు సువాసన మాత్రమే కాకుండా వాటిని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఏలకులలో అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దానివల్ల రక్తపోటును అదుపులో ఉంటుందని పలు అధ్యయనాల్లో వెళ్లడైంది. క్యాన్సర్ కారక కణాలు పెరగకుండా యాలకులు అడ్డుకుంటాయి. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ప్రమాదకర వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయి.

Cardamom health benefits, dosage, and side effects
అన్నం తిన్న తర్వాత రెండు యాలకుల్ని నోట్లో వేసుకుంటే ఆహారం సక్రమంగా జీర్ణం అవుతుంది. వీటిలోని ఔషధ గుణాలు బ్యాక్టీరియాతో పోరాడుతాయి. నోటి దుర్వాసన తగ్గిస్తుంది. యాలకుల్ని ఆహారంలో భాగం చేసుకుంటే శ్వాసకోస సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. యాలకులు ఆహార రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయుర్వేదం ప్రకారం ఏలకులు, జీర్ణ క్రియను మెరుగుపరచడమే కాకుండా జీర్ణ క్రియను ఆరోగ్యంగా ఉంచుతాయి. యాలకులు నమలడం వల్ల శ్వాసకోస ప్రక్రియ మెరుగుపడుతుంది. ఇది దుర్వాసన నుంచి రక్షణ కల్పిస్తుంది.
శరీరంలోని రోగనిరోధక లక్షణాలను పెంపొందిస్తాయి. ఇది శరీరంలో ఉండే మంట, చికాకును తగ్గిస్తాయి. యాలకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ప్రభావాలను తగ్గిస్తాయి. ఇది దీర్ఘకాలిక, తీవ్రమైన వ్యాధులను నివారించడంలో ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి యాలకులు ఉపయోగపడతాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. ఆందోళనను తగ్గించడానికి చాలామంది యాలకులను వాడుతూ ఉంటారు. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తోంది. లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి. యాలకులలో ఉండే విటమిన్లు ఎసెన్షియల్ ఆయిల్స్ చర్మాన్ని, జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి.