Jai Hanuman: “జై హనుమాన్” మూవీ పై కేసు నమోదు.. రిషబ్ శెట్టి వాళ్ళేనా.?
Jai Hanuman: ఈ మధ్యకాలంలో చాలావరకు పురాణ ఇథిహాసాలను బేస్ చేసుకుని సినిమాలు తీస్తున్నారు. ఈ సినిమాలు చాలావరకు హిట్ అవుతున్నాయి. అంతా బాగానే ఉన్నా కొన్ని సినిమాల్లో మాత్రం ఉన్న చరిత్రను వక్రంగా చూపించి అదే చరిత్ర అనుకునేలా చేస్తున్నారు. దీనిపై కొన్ని హిందూ అభిమాన సంఘాలు మండిపడుతూ సినిమాల కథలపై నిర్మాతలపై కేసులు కూడా వేస్తున్నారు. అయితే తాజాగా జై హనుమాన్ సినిమాకు సంబంధించి కూడా ఒక కేసు నమోదు అయింది. దీనికి కారణం ఏంటి ఆ వివరాలు ఏంటో చూసేద్దామా..
Case filed on Jai Hanuman movie
పోయిన ఏడాది సంక్రాంతి బరిలో హనుమాన్ సినిమా రిలీజ్ అయి అద్భుతమైన హిట్ సాధించింది. ఇందులో హనుమంతుడిగా తేజ సజ్జ అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హనుమంతు పాత్రలో ఆయన తప్ప ఇంకెవరు చేయలేరు అనే విధంగా యాక్టింగ్ చేశాడని చెప్పవచ్చు. అలాంటి ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ పేరుతో మరో మూవీ వస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని చాలా అద్భుతమైన కోణంలో తెరకేక్కిస్తున్నారట. ఈ సినిమాలో ఆంజనేయ స్వామి పాత్రలో తమిళ స్టార్ హీరోను తీసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. (Jai Hanuman)
Also Read: Charan-Pawan: పాపం.. చరణ్ పవన్ లకి జనవరి 10 భయం పట్టుకుందా..?
ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే కాంతారా సినిమాతో దేశాన్ని మొత్తం అతలాకుతలం చేసినటువంటి కన్నడ సూపర్ స్టార్ రిషబ్ శెట్టి.. జై హనుమాన్ చిత్రంలో ఆంజనేయ స్వామి పాత్రలో ఆయన నటిస్తున్నారు.. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి పోస్టర్ కూడా రిలీజ్ అయింది.. దీంతో ఈ ఫస్ట్ లుక్ పై లీగల్ గా కేసు కూడా నమోదు అయింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో రాముడు విగ్రహాన్ని పట్టుకొని కూర్చున్న రిషబ్ శెట్టి ఫోటోపై విపరీతమైన అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలోనే మైత్రి మూవీ మేకర్స్ సినిమాకి సంబంధించిన అందరిపై నాంపల్లి క్రిమినల్ కోర్టులో కేసు నమోదు అయింది.
ప్రముఖ న్యాయవాది మామిడాల తిరుమల రావు వాళ్లపై కేసు పెట్టాడు. కారణం ఏంటయ్యా అంటే.. ఈ చిత్రంలో హనుమంతుడి ముఖ చిత్రానికి బదులు రిషబ్ శెట్టి మొహాన్నే చూపించడం కొందరు తప్పుబడుతున్నారు.. భవిష్యత్తు తరాలకు అసలు హనుమంతుడు అంటే ఎవరు గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా హనుమంతుడి పాత్రలో నిజంగానే హనుమంతుడు ఎలా ఉంటాడో ఆ విధంగానే చూపించాలని ఆయన కేసు వేశాడు. ప్రస్తుత మీ కేసుకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై చిత్ర యూనిట్ వారు ఎలాంటి సమాధానం ఇస్తారు అనేది ముందు ముందు తెలుస్తుంది.(Jai Hanuman)