AP: ఏపీలో మరో ఎన్నిక.. షెడ్యూల్ విడుదల
AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఎన్నిక జరగబోతోంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యసభ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఇటీవల వైసిపి మాజీ నేత విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన మొన్నటి వరకు రాజ్యసభ హోదాలో ఉండడం జరిగింది.

CEC schedule for Rajya Sabha seat in AP
అయితే వైసిపి పార్టీతో పాటు తన రాజ్యసభ సీటుకు కూడా రాజీనామా పెట్టారు విజయసాయిరెడ్డి. ఇలాంటి నేపథ్యంలోనే రాజ్యసభ స్థానానికి తాజాగా ఎన్నికల సంఘం… నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు అధికారులు.
Drinking Warm Water: వేసవి కాలంలో వేడి నీళ్లు తాగుతున్నారా.. అయితే జాగ్రత్త !
ఈనెల 30వ తేదీన నామినేషన్ల పరిశీలన ఆ తర్వాత నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇస్తారు. మే 2వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు గడువు విధించారు. ఇక మే తొమ్మిదో తేదీన రాజ్యసభ స్థానానికి ఎన్నిక.. ఎన్నిక ఉంటుంది. అదే రోజున రిజల్ట్ కూడా ఇస్తారు. సంఖ్యాబలం ఆధారంగా కూటమికి ఈ సీటు దక్కే అవకాశాలు ఉన్నాయి. మరి ఇందులో ఎవరికి సీటు వస్తుందో చూడాలి.
NTR slim look: ఎన్టీఆర్ ని హింసిస్తున్న దర్శకులు.. ఏం ట్రాన్సఫర్ మేషన్ సామీ!!