Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 బ్యాటింగ్ రికార్డులు.. టాప్-5 బ్యాటర్లు వీళ్ళే!!

Champions Trophy 2025: పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్‌లో బ్యాటర్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. పాకిస్తాన్ పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. బ్యాటర్లు ఊహించని విధంగా సెంచరీలు బాదుతుండటంతో టోర్నమెంట్ ఉత్కంఠభరితంగా మారింది.
Champions Trophy 2025 top run-scorers list
ప్రస్తుతం టోర్నమెంట్‌లో నమోదైన అత్యధిక వ్యక్తిగత స్కోర్ 177 పరుగులు, అత్యధిక జట్టు స్కోర్ 356 పరుగులు. టోర్నీలో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ నిలిచాడు. అతను రెండు మ్యాచ్‌లలో 203 పరుగులు సాధించాడు. ఇబ్రహీం జర్దాన్ (అఫ్ఘనిస్తాన్) 194 పరుగులతో రెండో స్థానంలో ఉండగా, ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ 188 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ వికెట్ కీపర్ టామ్ లాథమ్ 173 పరుగులతో నాలుగో స్థానంలో, టీమిండియా ఓపెనర్ శుభమన్ గిల్ 147 పరుగులతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టోర్నమెంట్‌లో 122 పరుగులు చేసి ఆరో స్థానంలో ఉన్నాడు. మరోవైపు, పాకిస్తాన్ స్టార్ బాబర్ ఆజామ్ రెండు ఇన్నింగ్స్‌లలో 87 పరుగులు మాత్రమే చేసి 15వ స్థానంలో ఉన్నాడు. టాప్-10 జాబితాలో టీమిండియా నుంచి కోహ్లీ, గిల్ మాత్రమే ఉండడం విశేషం.
ఈ టోర్నమెంట్‌లో బ్యాటింగ్ రికార్డులు విరగదీస్తుండగా, రాబోయే మ్యాచ్‌లలో మరిన్ని అద్భుత ఇన్నింగ్స్ వచ్చే అవకాశముంది. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌ల కారణంగా స్కోర్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఏ ఆటగాడు చివరకు టోర్నమెంట్ టాప్ స్కోరర్‌గా నిలుస్తాడో చూడాలి.