Chandrababu: హరికృష్ణ కూతురుకు కీలక పదవి?
Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే రాజ్యసభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. వైసీపీ పార్టీకి చెందిన ముగ్గురు నేతలు రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఏపీలో మూడు రాజ్యసభ సీట్లకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, అలాగే ఆర్ కృష్ణయ్య… ఈ ముగ్గురు వైసీపీ పార్టీకి అలాగే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. Chandrababu
Chandrababu Big post Nandamuri Harikrishna Daughter Suhasini
దీంతో ఈ ముగ్గురి రాజ్యసభ సీట్లు ఖాళీ అయిపోయాయి.ప్రస్తుతం లెక్కల ప్రకారం ఈ మూడు రాజ్యసభ సీట్లు కూటమి చేతిలోకి వెళ్తాయి. ఈ తరుణంలోనే మూడు రాజ్యసభ టికెట్లు ఎవరికి వస్తాయని అందరూ చర్చించుకుంటున్నారు. ఇందులో ఒకటి జనసేనకు మరో రెండు సీట్లు కచ్చితంగా టిడిపి పార్టీకే వెళ్తాయని కొంతమంది అంచనా వేస్తున్నారు. Chandrababu
Also Read: RGV: నేను ఏడవడం లేదు… వణికిపోవడం లేదు?
జనసేనలో పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు టికెట్ వస్తుందని అంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీలో గల్లా జయదేవుకు ఒక టికెట్… హరికృష్ణ కూతురు సుహాసిని కి మరొక స్థానం వచ్చే ఛాన్స్ ఉందట. ఆమెను రాజ్యసభకు పంపాలని అనుకుంటున్నారట. ఈ మేరకు చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. Chandrababu