Janasena: నాగబాబుకు చంద్రబాబు ఊహించని షాక్.. పదవి లేదని తేల్చిన TDP ?

chandrababu big shock to nagababu

Janasena: మెగా బ్రదర్ నాగబాబుకు మరోసారి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో లేదా పార్లమెంట్ ఎన్నికల్లో కచ్చితంగా నాగబాబుకు జనసేన టికెట్ వస్తుందని అందరూ ఊహించారు. కానీ అప్పుడు మెగా బ్రదర్ నాగబాబుకు ఎదురుదెబ్బే తగిలింది. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తారని కూడా కొంతమంది ప్రచారం చేశారు. Janasena

chandrababu big shock to janasena nagababu

టిటిడి పాలక మండలికి సంబంధించిన చైర్మన్ పదవి నాగబాబుకు ఇస్తారని ప్రచారం కూడా జరిగింది. కానీ చివర్లో టీవీ5 అధినేత బి.ఆర్ నాయుడుకు ఆ పదవి దక్కింది. అయితే ప్రస్తుతం ఏపీలో రాజ్యసభ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి రాజ్యసభ టికెట్ నాగబాబుకు కచ్చితంగా వస్తుందని అందరూ ఊహించుకున్నారు. Janasena

Also Read: Eknath Shinde: బిజెపి కూటమి నుంచి షిండే అవుట్?

కానీ చివరి నిమిషంలో చంద్రబాబు నాయుడు బ్రేకులు వేశారట. వైసిపి పార్టీతో పాటు రాజ్యసభ పదవులకు రాజీనామా చేసిన బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ లకు తెలుగుదేశం పార్టీ నుంచి అవకాశం ఇవ్వబోతున్నారట నారా చంద్రబాబు నాయుడు. అయితే ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబుకు నో చెప్పారట. మళ్లీ ఏదైనా పదవి చూద్దాంలే.. అని కూటమి ప్రభుత్వం తేల్చి చెప్పిందట. దీంతో నాగబాబుకు ఎదురు దెబ్బ తగిలింది. Janasena

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *