Chandrababu: అమరావతిలో స్థలం కొన్న చంద్రబాబు.. ఎన్ని కోట్లంటే ?

Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమరావతి రాజధాని లో సొంతంగా స్థలం కొనుగోలు చేశారు నారా చంద్రబాబు నాయుడు. ఏపీ రాజధాని అమరావతిలో అసలు సొంత ఇల్లు లేకుండా చంద్రబాబు పాలన కొనసాగిస్తున్నాడని గత కొన్ని రోజులుగావిమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. సొంత ఇల్లు… ఇక్కడ లేకున్నా హైదరాబాదులో ఉంటూ… పాలన కొనసాగించే ఏకైక ముఖ్యమంత్రి అని వైసిపి దారుణంగా ట్రోలింగ్ చేసేది. Chcnadrababu

Chandrababu buy land in amaravati

ఈ తరుణంలోనే నారా చంద్రబాబు నాయుడు… అమరావతి రాజధాని లో… తాజాగా స్థలం కొని ఆ విమర్శలకు చెక్ పెట్టారు. ప్రస్తుతం విజయవాడలోని కరకట్ట ప్రాంతంలో ఉన్న గెస్ట్ హౌస్ లో ఉంటున్నారు చంద్రబాబు నాయుడు. ఆయన కుటుంబమంతా హైదరాబాదులో ఉంటోంది తాజాగా.. వెలగపూడి రెవెన్యూ విభాగంలో ఉన్న 25 వేల చదరపు అడుగుల స్థలాన్ని కొనుగోలు చేశారట నారా చంద్రబాబు నాయుడు. ఈ స్థలం ఏకంగా ముగ్గురు రైతుల కు సంబంధించినదని సమాచారం. Chcnadrababu

Also Read: Harish Rao Case: హరీష్ రావు పై కేసు పెట్టిన చక్రధర్ గౌడ్ లీలలు?

ఆ ముగ్గురు రైతులకు.. మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు చేశారట నారా చంద్రబాబు నాయుడు. సెక్రటేరియట్ కు ఇది అత్యంత సమీపంలోనే ఉంటుందని సమాచారం. అతి త్వరలోనే భూమి పూజ చేసి ఇల్లు కూడా కట్టబోతున్నారట నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు.. చర్యలు తీసుకుంటున్నారట ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. Chcnadrababu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *