Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. 164 స్థానాలు దక్కించుకున్న తెలుగుదేశం కూటమి… అధికారాన్ని చేజిక్కించుకుంది. టిడిపి దాదాపు 134 స్థానాలు గెలుచుకోగా… జనసేనకు 21 స్థానాలు వచ్చాయి. అంటే జనసేనకు 100 శాతం స్ట్రైక్ రేట్ తో… సీట్లు వచ్చాయన్నమాట. ఇక ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు అయిన… జనసేనకు కేవలం 3 మంత్రి పదవులు ఇచ్చి.. చంద్రబాబు అవమానపరిచారు. Pawan Kalyan

Chandrababu insulting Pawan Kalyan

అందులోనూ ప్రాధాన్యత లేని పదవులు జనసేనకు ఇవ్వడం మరింత వివాదంగా మారింది. అంతేకాకుండా… మొన్న ఈనాడు న్యూస్ అధినేత రామోజీరావు మరణ అనంతరం… సంతాప సభ విజయవాడలో జరిగింది. ఈ సభ కోసం.. పత్రికా ప్రకటన ఇచ్చారు చంద్రబాబు. ఇందులో కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో మాత్రమే వేశారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో మాత్రం ఎక్కడా కనిపించలేదు. Pawan Kalyan

Also Read: KCR: కేసీఆర్ కు బిగ్ షాక్… మామ, అల్లుళ్లు జంప్ ?

ఇక మొన్న… జులై ఒకటో తేదీ నుంచి పెన్షన్ల ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా… చంద్రబాబుతో పాటు… చాలా మంది నేతలు పెన్షన్ ప్రక్రియలో పాల్గొన్నారు. అయితే ఈ పెన్షన్ కార్యక్రమం నేపథ్యంలో కూడా చంద్రబాబు ప్రకటన ఇచ్చారు. ఈ పత్రికా ప్రకటనలో కూడా పవన్ కళ్యాణ్ ఫోటో ఎక్కడ కనిపించలేదు. దీంతో జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Pawan Kalyan

ఇటు… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ పర్యటనను ముగించుకొని..హైదరాబాద్ చేరుకున్నారు. అయితే రేవంత్ రెడ్డి ప్రతి ఢిల్లీ టూర్ కు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కచ్చితంగా వెళ్తారు. కానీ ఏపీలో మాత్రం చంద్రబాబు ఒక్కడే వెళ్లారు. పవన్ కళ్యాణ్ కు సమాచారం కూడా ఇవ్వలేదట. దీంతో ఇప్పుడు ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఇలా అడుగడుగునా…. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అన్యాయం జరుగుతోందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. Pawan Kalyan