Tirumala: తిరుమలలో హిందువులు మాత్రమే పని చేయాలి.. చంద్రబాబు స్టేట్ మెంట్ ?
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో కేవలం హిందువులు మాత్రమే పనిచేయాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. తాజా గా నారా లోకేష్ కొడుకు, చంద్రబాబు నాయుడు మనవడు పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులందరూ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Chandrababu Naidu made sensational comments after visiting Tirumala Srivara
అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. తిరుమల ఆలయంలో హిందువులు మాత్రమే పనిచేయాలని… పనిచేయాలని ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇతర మతస్తులు ఉంటే వారి మనోభావాలు దెబ్బ తినకుండా ఇతర చోట్లకు మారుస్తామని తేల్చి చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తిరుమల శ్రీవారి ఆలయాలను కాపాడడం కోసం కంకణం కట్టుకున్నామని వివరించారు. విదేశాలలో కూడా తిరుమల శ్రీవారి ఆలయాలు ఉంటే బాగుండేదని చాలామంది కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.