Charan-Pawan: పాపం.. చరణ్ పవన్ లకి జనవరి 10 భయం పట్టుకుందా..?

Charan-Pawan: రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ లకి నిజంగానే జనవరి 10 భయం పట్టుకుందా..ఇంతకీ జనవరి పది రోజు వీరికి ఎందుకు కలిసి రావడం లేదు.. మెగా ఫ్యామిలీని నిజంగానే జనవరి 10 వెంటాడుతుందా అనేది ఇప్పుడు చూద్దాం.. రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ లకి జనవరి భయం పట్టుకుంది అంటే దానికి ఓ కారణం ఉంది.అదేంటంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అజ్ఞాతవాసి మూవీ 2018 జనవరి 10 న విడుదలై భారీ డిజాస్టర్ అయింది.

Charan-Pawan is afraid of January 10

Charan-Pawan is afraid of January 10

ఈ సినిమా మొదటి షో నుండే అట్టర్ ప్లాఫ్ టాక్ తెచ్చుకోవడం తో సినిమా దారుణంగా ప్లాఫ్ అయింది.దాంతో చాలామంది సినిమా చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పెదవి విరిచారు. ముఖ్యంగా త్రివిక్రమ్ వంటి స్టార్ డైరెక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబోలో జల్సా, అత్తారింటికి దారేది వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. అయితే వీరి కాంబోలో సినిమా అంటే భారీ అంచనాలు ఉంటాయి. దాంతో అజ్ఞాతవాసి సినిమాపై కూడా ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి.(Charan-Pawan)

Also Read: Game Changer: గేమ్ ఛేంజర్ మూవీ లో ఇది గమనించారా.. చిరంజీవి చంద్రబాబులను దించుతూ..?

కానీ సినిమా చూసిన ప్రేక్షకులు మాత్రం చాలా నిరాశపడ్డారు.అలా 2018 జనవరి 10 న విడుదలైన అజ్ఞాతవాసి భారీ డిజాస్టర్ అయ్యింది.ఈ సినిమా విడుదలై 2025 జనవరి 10 కి 7 సంవత్సరాలు పూర్తయింది. అయితే తాజాగా అదే జనవరి 10న రాంచరణ్ గేమ్ ఛేంజర్ మూవీ కూడా విడుదలైంది.ఇక ఈ సినిమా విడుదలైన మొదటి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

Charan-Pawan is afraid of January 10

అలాగే గేమ్ చేంజర్ మూవీ జనవరి 10న విడుదలై ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే అజ్ఞాతవాసి ప్లాఫ్ ని మర్చిపోదామని ఎంతోమంది మెగా ఫ్యాన్స్ ఆశగా చూసారు. కానీ అదే జనవరి 10న వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో మెగా ఫ్యామిలీకి జనవరి 10 కలిసి రావడం లేదు అని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ గా మారాయి. అంతేకాదు మెగా ఫ్యామిలీని జనవరి 10 భయం వెంటాడుతోంది అంటూ మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.(Charan-Pawan)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *