Honey: బాదంతో తేనె కలుపుకుని తింటే 100 రోగాలకు చెక్ ?
Honey: డ్రై ఫ్రూట్స్ లో బాదం పప్పుకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. బాదం బలవర్ధక ఆహారం. 100 గ్రాముల బాదం నుంచి 579 కేలరీలు శరీరానికి అందుతాయి. సుమారు 49 గ్రాముల కొవ్వులు శరీరానికి లభిస్తాయి. 21 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. కాపర్, మెగ్నీషియం, ఖనిజాలు, మాంగనీస్, ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా బాదంలో విటమిన్ ఈ, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి.

Check for 100 diseases if you mix honey with almonds
ప్రతిరోజు నానబెట్టిన బాదంపప్పును తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అయితే బాదంను తేనెలో కలిపి తింటే చాలా మంచిది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలు చేకూరతాయి. కానీ తేనే బాదంపప్పు కలిపి తినడం వల్ల శరీరానికి కావాల్సిన తక్షణ శక్తి లభిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో తేనెలో నానబెట్టిన బాదం పప్పులు తినడం వల్ల రోజంతా చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటారు. ఇది చాలా శక్తిని అందిస్తుంది.
ఇందులో ఫైబర్, పోషకాలు అధికంగా ఉంటాయి. జీర్ణ క్రియను మెరుగు పరుస్తాయి. తేనెలో నానబెట్టిన బాదం తినడం వల్ల ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, పోషకాలు అందుతాయి. ఇది చర్మాన్ని, జుట్టును బలంగా ఉంచుతుంది. ఈ రెండింటి కలయిక జీవ క్రియను మెరుగుపరుస్తుంది. అనేక రకాల సమస్యలను తొలగిస్తుంది. శరీరానికి కావాల్సిన క్యాలరీలు అన్ని లభ్యమవుతాయి.