Cloves: లవంగాలతో బోలెడు లాభాలు?
Cloves: ప్రతి ఇంట్లోనూ వాడే మసాలా దినుసులలో లవంగాలు ఒకటి. ఇది మధ్య రుచి, వాసన కలిగి ఉంటాయి. అంతేకాకుండా శరీరానికి కూడా ఎన్నో రకాల ప్రయోజనాలను చేకూరుస్తాయి. పొడి దగ్గు, కఫం, జలుబు లాంటి సమస్యలతో బాధపడే వారికి లవంగాలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతిరోజు లవంగాలతో తయారు చేసిన టీని తాగినట్లయితే జీర్ణక్రియ, జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. గ్యాస్, ఎసిడిటీ, అల్సర్ లాంటి సమస్యలు దరి చేరవు. లవంగాలు శరీరంలోని టాక్సిన్లను తొలగించి చర్మం మృదువుగా, ఆరోగ్యంగా అనిపించేలా చేస్తాయి.

Chewing Two Cloves Will Reduce Bloating Constipation And Stomach Ache Within 4 Minutes
లవంగాలను రోజు రెండు నోటిలో వేసుకుని నమలడం వల్ల నోటి దుర్వాసన, పళ్ళ సమస్యలు తొలగిపోతాయి. లవంగాలలో యూజైనాల్ అనే తైలం ఉంటుంది. ఇది శరీరంలోని వేడిని తొలగిస్తుంది. కీళ్ల నొప్పులు, వాపులు లాంటి సమస్యలతో బాధపడేవారు లవంగాలను ప్రతిరోజు తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. డయాబెటిస్ తో బాధపడే వారికి కూడా లవంగాలు చక్కగా పనిచేస్తాయి. ఇవి శరీరంలోని ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. లవంగాలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతిరోజు లవంగాలను వాడడం వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
లవంగాలలో ఉండే ప్రోటీన్స్ కారణంగా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతిరోజు లవంగాలను వాడడం వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. మనం తీసుకునే ఆహారంలో ఏ రూపంలో అయినా సరే లవంగాలను చేర్చుకున్నట్లయితే శరీరంలో ఏర్పడే అనేక రకాల ఇన్ఫెక్షన్లను తొలగిస్తుంది. ఇక మరి కొంతమంది లవంగాలను కషాయం రూపంలో కూడా తయారు చేసుకుని తీసుకుంటూ ఉంటారు. ఒక గ్లాసెడు నీటిలో రెండు లవంగాలను వేసి ఐదు నిమిషాల పాటు మరిగించి వాటిని తాగినట్లయితే చాలా మంచిది.