Chia Seeds Benefits: చియా విత్తనాలను ఇలా గనుక తిన్నట్లైతే ?
Chia Seeds Benefits: చియా గింజలు ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. కాల్షియం అధికంగా లభించే పదార్థాలలో చియా గింజలు ఒకటి. వీటిని ఓట్స్ తో కలిపి తినవచ్చు. ఈ గింజలలో ఒమేగా త్రీ, ఫ్యాటీ ఆమ్లాలు, ఫైబర్, ప్రోటీన్లు, పోషకాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు వీటిని తప్పకుండా తినాలి. అందుకే చీయా విత్తనాలను ఆహారంలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తినడం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా తయారవుతాయి. వీటిలోనూ మెగ్నీషియం అధికంగా ఉంటుంది.

Chia Seeds Benefits For Human
అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం అధికంగా ఉంటాయి. ఈ విత్తనాలు హార్మోన్ల పనితీరును సమతౌల్యం చేస్తాయి. రక్తపోటును నియంతిస్తాయి. అయితే చాలామందికి విత్తనాలను ఎలా తీసుకోవాలో తెలియదు. చియా గింజలలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలతో నిండి ఉంటాయి. ఈ విత్తనాలను పాలతో కలిపి రాత్రంతా అలాగే నానబెట్టి ఉదయం పరగడుపున తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది.
స్మూతీస్ లో కూడా వీటిని తినవచ్చు. స్మూతీస్ లో ఒక టేబుల్ స్పూన్ చియా విత్తనాలను వేసుకొని తినాలి. ఇవి రుచిని మార్చకుండా శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. అలాగే ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ లోకి చియ విత్తనాలను తీసుకోవచ్చు. పెరుగు లేదా ఓట్ పైన చియా విత్తనాలను చల్లుకొని తినాలి. చియా విత్తనాలను నీటితో నానబెట్టి డ్రింక్స్ లలో కూడా తాగవచ్చు. ఇందులో ఓట్స్, తేనే ఇతర పదార్థాలతో కలిపి ఎనర్జీ బార్ లను తయారు చేసుకోవచ్చు. సలాడ్స్ లలోను వీటినే కలుపుకుని తిన్నట్లయితే చాలా మంచిది.