
యున్నాన్ ప్రావిన్స్‌లో ఓ వ్యక్తికి ఇన్‌ఫ్లుయెంజా A(H1N2)v అనే కొత్త రకం వైరస్ సోకినట్లు అధికారులు కనుగొన్నారు. సాధారణంగా పందుల్లో మాత్రమే కనిపించే ఈ వైరస్ ఇప్పుడు మనుషులకు వ్యాపించడం ఇదే తొలిసారి. దీంతో హెల్త్ డిపార్ట్‌మెంట్ అంతా అలర్ట్ అయిపోయింది.
China Virus First Human Case Report
చైనా CDC ఇటీవల విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం, ఈ వైరస్ పందుల నుంచి నేరుగా మనిషి శరీరంలోకి ఎంటర్ కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇది ఒక జూనోటిక్ ట్రాన్స్‌మిషన్ అంటే జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే ఇన్ఫెక్షన్. ఈ విషయాన్ని మెడికల్ ఎక్స్‌పర్ట్స్ చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు ఎందుకంటే ఇలాంటి వైరస్ మ్యుటేషన్ చెంది మరింత వేగంగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
WHO లేటెస్ట్ డేటా ప్రకారం, ఈ ఏడాది మార్చి 31 నాటికి దాదాపు 13 కొత్త నోవెల్ ఫ్లూ ఇన్ఫెక్షన్లు వరల్డ్ వైడ్‌గా రికార్డ్ అయ్యాయి. ఇవి నాలుగు కాంటినెంట్స్‌లో వివిధ రకాల ఏవియన్ మరియు స్వైన్ ఫ్లూ వేరియంట్లుగా ఉన్నాయి. గతంలో అమెరికా, యూకేలో కూడా ఇలాంటి వేరియంట్ కేసులు నమోదయ్యాయి. కానీ ఇప్పుడు చైనాలో తొలిసారి ఈ H1N2 రకం మనిషిలో కనిపించడం గమనార్హం.
పబ్లిక్ హెల్త్ సేఫ్టీ దృష్ట్యా ఈ వైరస్ మీద కచ్చితమైన సర్వైలెన్స్ అవసరమని సైంటిస్టులు చెబుతున్నారు. పందుల ఫారాల దగ్గర పనిచేసేవాళ్లు, వెటర్నరీ సిబ్బంది మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మాస్కులు, శానిటైజేషన్, జంతువులతో దూరం పాటించడం వంటి ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకోవాలని హెల్త్ అథారిటీలు సలహా ఇస్తున్నాయి.







