Chiranjeevi Focuses: అయోమయంగా చిరంజీవి మూవీ.. టెన్షన్ లో మెగా ఫ్యాన్స్!!
Chiranjeevi Focuses: మెగాస్టార్ చిరంజీవి సరికొత్త సినిమా చేయాలని, రొటీన్ మాస్ మసాలా సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా, చిరంజీవి ప్రస్తుతం నవతరం దర్శకులతో కలిసి పనిచేయాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే, వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ అనే చిత్రం చేస్తున్న చిరంజీవి, మరికొంతమంది దర్శకులను లైన్‌లో పెట్టారు. వీరిలో బాబీతో మరో సినిమాను చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Chiranjeevi Focuses on Young Directors Films
ఇప్పటికే చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చేసి 2023 సంక్రాంతికి విడుదల చేసి బాక్సాఫీస్ వద్ద మంచి హిట్టు అందుకున్నాడు. ఈ సినిమా, చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ విజయంతో, చిరంజీవి మరోసారి బాబీతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ బాబీ ఇప్పటికే ఒక స్టోరీ రెడీ చేసుకుని, చిరంజీవి చెప్పగా అయన ఒకే చెప్పే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు.ఈ కాంబో త్వరలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని మెగా ఫ్యాన్స్ ఆశాభావంగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Pushpa 2 Box Office: అక్కడ పుష్ప 2 బ్రేక్ ఈవెన్ కూడా చేరుకోలేదా?
అయితే చిరంజీవి, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించారు. నాని ఈ సినిమాను సమర్పిస్తున్నారు. శ్రీకాంత్ ‘పారడైజ్’ చిత్రం పూర్తయిన తర్వాత, మెగా మాస్ ప్రాజెక్ట్ పనులు మొదలవుతాయని సమాచారం. దీనితో పాటు, చిరంజీవి అనిల్ రావిపూడితో కూడా ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా 2025 ప్రారంభంలో అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం, అనిల్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు, ఆ సినిమా విడుదలయ్యాక చిరంజీవి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టనున్నారు.
ఇంకా, బాబీ ప్రస్తుతం ‘డాకు మహారాజ్’ సినిమా తో బిజీగా ఉన్నారు, ఇది కూడా సంక్రాంతికి విడుదల అవుతుంది. ఈ సినిమా తర్వాత, బాబీ చిరంజీవి సినిమా స్క్రిప్ట్ పై పనిచేస్తారని వార్తలు ఉన్నాయి. శ్రీకాంత్, అనిల్ సినిమాల్లో చిరంజీవి ఏది ముందుగా సెట్స్ పైకి తీసుకెళ్లేవాడో త్వరలో స్పష్టమవుతుంది. ‘విశ్వంభర’ సినిమా ఫలితం ఆధారంగా చిరంజీవి ప్రాధాన్యత మారవచ్చని కూడా కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే, చిరంజీవి తన సినిమాలు వరుసగా చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. చిరంజీవి, యువ దర్శకులతో సినిమాలు చేయాలని నిర్ణయించుకోవడం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. అవి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టయితే, మెగా ఫ్యాన్స్ కొద్దిగా ఆశాజనకంగా ఉంటారు