Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చీమకు కూడా హాని చేయడు అంటుంటారు చాలామంది ఈయన గురించి తెలిసిన వాళ్ళు. ఇప్పటికే ఎన్నో ప్రత్యక్ష పరోక్ష దానధర్మాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈయన చేసిన మంచి పని ఏదైనా సరే ఎక్కువ శాతం బయటపెట్టారు. గుట్టు గానే దానధర్మాలు చేస్తూ ఉంటారు. అయితే అలాంటి చిరంజీవిపై ఓ హీరోయిన్ కక్ష కట్టిందని,తన పరువు తీయడం వల్లే చిరంజీవిపై అలా పగ పెంచుకుంది అని కొన్ని రూమర్లు అప్పట్లో వినిపించాయి.
Chiranjeevi insult that heroine
ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు రోజా.. అయితే రోజా చిరంజీవిపై కక్ష పెంచుకోవడం ఏంటి అని చాలామంది ఈ విషయం విని ఆశ్చర్యపోతారు.అయితే విరిద్దరూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడైతే వచ్చారో అప్పటినుండి వ్యతిరేక పార్టీలు కాబట్టి పరస్పరం విమర్శలు చేసుకోవడం మొదలు పెట్టేసారు. అయితే చిరంజీవి రాజకీయాల్లో నుండి తప్పుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్, నాగబాబులపై రోజా మండిపడుతూనే ఉంటుంది.(Chiranjeevi)
Also Read: Suman: ఆ రోజుల్లోనే 175 ఎకరాలు.. ఆ లేడీ మీద ఇష్టంతో సుమన్ ఏం చేసాడో చూడండి.?
అయితే ఈ విషయం మీడియాలో ఎక్కువ వవైరల్ అవ్వడంతో ఓ రూమర్ పుట్టుకొచ్చింది. అదేంటంటే.. చిరంజీవితో రోజా నటించే సమయంలో ఆమెను షూటింగ్ సెట్లో ఓ సందర్భంలో చిరంజీవి అవమానించాడని, అందుకే కక్ష పెంచుకున్న రోజా ఇలా రాజకీయాల్లోకి వచ్చాక మెగా ఫ్యామిలీని చెడుగుడు ఆడుకుంటుంది అంటూ ప్రచారం చేశారు.
అయితే ఈ విషయంపై ఓ సందర్భంలో స్పందించిన రోజా అలాంటిదేమీ లేదు. వ్యక్తిగత కక్షలు, పగలు అంటూ ఏమీ లేదు. కానీ ఇద్దరం వేరే వేరే పార్టీలో ఉన్నాం కాబట్టి మా పార్టీలకు అనుగుణంగా ఒకరిపై ఒకరం విమర్శలు చేసుకుంటాం తప్ప పర్సనల్గా మా మధ్య చిన్న గొడవ కూడా లేదు అంటూ రోజా క్లారిటీ ఇచ్చింది.(Chiranjeevi)