Chiranjeevi new movies: ఇంట్రస్టింగ్‌గా చిరు లైనప్‌.. ఎందుకీ సడెన్ మార్పు!!

Chiranjeevi new movies with young directors

Chiranjeevi new movies: మెగాస్టార్ చిరంజీవి, యంగ్ జనరేషన్‌తో పోటీపడటానికి, వారి వేవ్‌లెంగ్త్‌ను మ్యాచ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు. అందుకే, ఆయన వరుసగా కుర్ర దర్శకులతోనే సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ప్రకటించిన సినిమాలు, అలాగే డిస్కషన్‌లో ఉన్న ప్రాజెక్టులు చిరంజీవి మెగా లైనప్‌పై భారీ అంచనాలు పెంచాయి.

Chiranjeevi new movies with young directors

బాబీ దర్శకత్వంలో “వాల్తేరు వీరయ్య” సినిమా బిగ్ హిట్ కావడంతో, చిరంజీవి అదే జోరులో కొనసాగాలని చూస్తున్నారు. అందువల్ల, ఆయన తరచుగా యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ సారి, ఆయన విశ్వంభర సినిమా సెట్స్ మీద ఉన్నపుడు, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక సినిమా కూడా ప్రకటించారు.

ఈ సినిమా “రూట్లెస్ యాక్షన్ డ్రామా”గా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ప్రీ లుక్ పోస్టర్‌తోనే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం, చిరంజీవి కెరీర్‌లో మరో మైల్‌స్టోన్‌గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. తాజాగా, “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడితో చిరంజీవి ఓ కొత్త ప్రాజెక్టు ఓకే చేశారు. ఈ సినిమాకు, ఒదెల ప్రాజెక్ట్‌ను వెనక్కి నెట్టి మరీ అనిల్‌కు డేట్స్ ఇచ్చారు. ఈ సినిమాలు, యంగ్ జనరేషన్‌కు గట్టి పోటీ ఇవ్వడానికి చిరంజీవి ప్రణాళికలు వేసుకున్నట్లు తెలుస్తోంది. మరి అయన సక్సెస్ బాటలో నిలుస్తాడా అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *