Chiranjeevi: డైరెక్టర్ తో చిరంజీవి గొడవ.. “విశ్వంభర” సినిమాకి ఆటంకాలు.?
Chiranjeevi: ఏంటి డైరెక్టర్ తో చిరంజీవి నిజంగానే గొడవపడ్డారా.విశ్వంభర మూవీకి ఆటంకాలు తప్పవా.. ఇంతకీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ లో ఉన్న నిజమెంత.. చిరంజీవి వశిష్ట మధ్య గొడవ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న విశ్వంభర మూవీలో మెగాస్టార్ చిరంజీవి, త్రిష,మృణాల్ ఠాగూర్, మీనాక్షి చౌదరి వంటి హీరోయిన్లు నటిస్తున్నట్లు ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి.
Chiranjeevi quarrel with the director
మెగాస్టార్ వశిష్ట కాంబినేషన్లో సోషియా ఫాంటసీ మూవీగా తెరకెక్కుతున్న విశ్వంభర మూవీ సంక్రాంతికి వస్తుందని అనుకున్నారు. కానీ కొడుకు గేమ్ చేంజర్ మూవీ కోసం చిరంజీవి తన విశ్వంభర మూవీని సమ్మర్ కి వాయిదా వేసుకున్నారు. ఈ సినిమా జూన్ లేదా జూలైలో విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ విషయంలో మెగాస్టార్ కి డైరెక్టర్ వశిష్టకి మధ్య గొడవ జరిగినట్టు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.(Chiranjeevi)
Also Read: Sankranthiki Vasthunnam: “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాని రిజెక్ట్ చేసిన అన్ లక్కీ హీరో.?
అయితే సంక్రాంతికి అనుకున్న సినిమా సమ్మర్ కి పోస్ట్ పోన్ అవ్వడంతో ఈ సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకొని సినిమా బాగా వచ్చేలా గ్రాఫిక్స్ తీయాలి అని డైరెక్టర్ కి చెప్పారట చిరంజీవి. ఇక చిరంజీవి మాటలతో డైరెక్టర్ కూడా గ్రాఫిక్స్ బాగా వచ్చేటట్టు చేశారట. కానీ రీసెంట్గా చిరంజీవికి ఒక షాట్ డైరెక్టర్ చూపించారట. కానీ అది చూసిన చిరంజీవి డైరెక్టర్ పై ఫైర్ అయినట్టు తెలుస్తోంది. ఇంత సమయం వచ్చినా కూడా ఈ గ్రాఫిక్స్ ఏమీ బాగాలేవు.చూస్తే కొత్తదనం కనిపించాలి.
కానీ ఈ షాట్ లో కొత్తదనం కనిపించడం లేదు.ఇంత టైం ఉన్నా కూడా వేస్ట్ చేస్తున్నావు అని డైరెక్టర్ వశిష్ట పై చిరంజీవి అసహనం వ్యక్తం చేశారట. దాంతో సీరియస్ గా తీసుకున్న డైరెక్టర్ మళ్ళీ గ్రాఫిక్స్ ని రీ డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పాన్ ఇండియా మూవీ అయినా కల్కి కి పనిచేసిన గ్రాఫిక్స్ కంపెనీతో వశిష్ట చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. విశ్వంభరకి కూడా ఆ గ్రాఫిక్ కంపెనీ వాళ్ల సహాయం పొందాలని చూస్తున్నారట. మరి చూడాలి సోషియో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.(Chiranjeevi)