Chiranjeevi: చిరంజీవికి నితిన్ భార్యకి మధ్య రిలేషన్.. షాకింగ్ సీక్రెట్.?

Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. ఇందులో స్టార్ డం పొందిన వారిని పక్కన పెడితే, స్టార్ హోదా కోసం కొట్టుమిట్టాడుతున్న హీరోలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నితిన్. ఒక సినిమా హిట్ అయితే మరో రెండు సినిమాలు ఫ్లాప్ అనే విధంగా వీరి కెరియర్ కొనసాగుతోంది. అయినా వీరి క్రేజ్ మాత్రం అభిమానుల్లో తగ్గడం లేదని చెప్పవచ్చు. అలా నితిన్ పడుతూ లేస్తూ సినిమాలు చేస్తున్న సమయంలోనే శాలిని అనే అమ్మాయితో లవ్ లో పడి చివరికి వివాహం చేసుకున్నారు.
Chiranjeevi relationship with Nitiin wife
నితిన్ పెళ్లి చేసుకున్న అమ్మాయికి, చిరంజీవికి మధ్య సంబంధం ఉందట. ఆ సంబంధం ఎలాంటిది.. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. ఇష్క్ సినిమా చేస్తున్న టైంలోనే ఒక స్నేహితుని ద్వారా శాలినితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా మారి చివరికి ప్రేమ వరకు దారితీసింది. వీరి లవ్ ను మూడో కంటికి తెలియకుండా సీక్రెట్ గా మైంటైన్ చేశారు. చివరికి కరోనా సమయంలో దగ్గరి కుటుంబ సభ్యుల మధ్య వివాహం ద్వారా ఒకటయ్యారు.. (Chiranjeevi)
Also Read: Naga Chaitanya: సమంతకి అక్కడే ఎండ్ కార్డు..శోభితతో తొలి పరిచయం.. చైతూ కామెంట్స్ వైరల్.?
అలా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నటువంటి నితిన్ భార్య శాలిని చిరంజీవి కుటుంబానికి చాలా దగ్గర వ్యక్తులట. ఎలాగంటే శాలిని తల్లిదండ్రులైన సంపత్ నూర్జహాన్ కర్నూలుకు చెందిన వారే. వీరు ఎన్నో ఏళ్లుగా ఆ ప్రాంతంలోనే వైద్యులుగా కొనసాగుతూ ఆసుపత్రి నడిపిస్తున్నారు. అయితే వీరికి కర్నూలు ప్రాంతంలో మంచి పేరు ఉంది.. కట్ చేస్తే 2008 సమయంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఆ సమయంలోనే అన్ని నియోజకవర్గాల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున అభ్యర్థులను వెతుకుతున్నారు.

ఈ టైం లోనే కర్నూలు నియోజకవర్గంలో నూర్జహాన్ కు మంచి పేరు ఉందని తెలుసుకున్న చిరంజీవి వారిని పిలిపించుకొని మాట్లాడి ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా టికెట్ అందించారట. కానీ ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోవడంతో రాజకీయాలకు పూర్తిగా దూరమైపోయి వారి కెరియర్ ను చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారట. అప్పటినుంచి చిరంజీవికి మరియు శాలిని ఫ్యామిలీకి మంచి బంధం ఏర్పడిందని, అది ఇంకా కొనసాగుతోందని తెలుస్తోంది.(Chiranjeevi)