Chiranjeevi: ఆ హీరో భార్యతో చిరంజీవి రొమాన్స్.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న న్యూస్.?


Chiranjeevi romance with that hero wife

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి..ఈ హీరో పేరు చెబితేనే ఎంతోమందికి ఒక విధమైన ఊపు బాడీలో వస్తుంది. అయితే అలాంటి చిరంజీవి ఓ స్టార్ హీరో భార్యతో రొమాన్స్ చేయబోతున్నారంటూ టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో ఒక రూమర్ చక్కర్లు కొడుతోంది. మరి ఇంతకీ చిరంజీవి ఎవరితో రొమాన్స్ చేయబోతున్నారో ఇప్పుడు చూద్దాం. సీనియర్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడం డైరెక్టర్లకు కత్తి మీద సాములా మారిపోతుంది.

Chiranjeevi romance with that hero wife

ఎందుకంటే యంగ్ హీరోయిన్లను సెట్ చేద్దామంటే ఏజ్ గ్యాప్ బాగా వస్తుంది. సీనియర్ హీరోయిన్లతో ఇప్పటికే చిరంజీవి చేసే ఉన్నారు. ఒకవేళ మళ్లీ వారితోనే సినిమా చేస్తే వారి కాంబో బోరింగ్ గా అనిపించి సినిమా మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే కొత్త హీరోయిన్లని సెట్ చేయాలి అని డైరెక్టర్లు ఎప్పుడు ఆతృత పడుతూనే ఉంటారు.అయితే ప్రస్తుతం అనిల్ రావిపూడి తో చిరంజీవి చేయబోతున్న సినిమాలో ఓ స్టార్ హీరో భార్యని అనిల్ రావిపూడి సెట్ చేసినట్టు రూమర్లు వినిపిస్తున్నాయి.(Chiranjeevi)

Also Read: Prabhas: తమన్నా ఫ్రెండ్ తో ప్రభాస్ పెళ్లి.. ముద్దు పెట్టుకున్న ఫొటోస్ వైరల్.?

ఇక ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే సిద్ధార్థ్ భార్య అదితీ రావు హైదరి.చిరంజీవితో అదితి రావు హైదరి అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.అయితే ఇందులో ఉన్నది ఎంత నిజమో తెలియదు కానీ చాలామంది నెటిజన్లు మాత్రం వీరి కాంబో అంత బాగుండదు. చిరంజీవికి ఆమె అస్సలు సెట్ అవ్వదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక మరి కొంతమందేమో ఎలాంటి యంగ్ హీరోయిన్స్ ని అయినా ఎంత పెద్ద సీనియర్ హీరోలైనా సరే అనిల్ రావిపూడి వారి కాంబో ని చిటుక్కున సెట్ చేసేస్తారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Chiranjeevi romance with that hero wife

మరి అనిల్ రావిపూడి నిజంగానే అదితి రావు హైదరీ ని తన సినిమాలో ఫిక్స్ చేశారా..చిరంజీవి అదితి కాంబో బాగుంటుందా..వీరి కాంబోకి క్రేజ్ ఉంటుందా లేక ఫ్లాప్ అవుతుందా అనేది తెలియాలంటే కచ్చితంగా చిరంజీవి, అదితి లకు అనిల్ రావిపూడి కి స్క్రీన్ టెస్ట్ చేసి చూస్తే గాని తెలియదు.ఒకవేళ వీరిద్దరి జోడి పర్ఫెక్ట్ గా ఉంటే మాత్రం అనిల్ రవిపూడి నెక్స్ట్ మూవీ లో చిరంజీవి సిద్ధార్థ్ భార్యతో రొమాన్స్ చేయడం పక్కా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.(Chiranjeevi)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *