Vishwambhara: విశ్వంభరలో మెగా ఫ్యామిలీ గెస్ట్ రోల్స్? క్లారిటీ ఇదే!!


Vishwambhara First Single Coming Soon

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర (Vishwambhara) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. బింబిసార (Bimbisara) సినిమాతో ఘనవిజయం సాధించిన దర్శకుడు వశిష్ఠ (Director Vashishta) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సోషియో-ఫాంటసీ (socio-fantasy) కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విజువల్ వండర్ (Visual Wonder)గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కి విడుదలైన పోస్టర్లు మరింత ఆసక్తి రేపాయి. ముఖ్యంగా, ఇటీవల విడుదలైన గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. మెగా అభిమానులు ఈ సినిమాకు సంబంధించిన సాలిడ్ అప్డేట్ (solid update) కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. కానీ, పెద్దగా అప్డేట్స్ రాకపోవడంతో కొంతమంది అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు.

Chiranjeevi Vishwambhara Mega Family Cameos

ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన లీక్ (leak) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విశ్వంభరలో మెగా ఫ్యామిలీకి చెందిన హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) మరియు నిహారిక కొణిదెల (Niharika Konidela) గెస్ట్ రోల్స్‌లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. నిహారిక గతంలో సైరా నరసింహా రెడ్డి (Sye Raa Narasimha Reddy) సినిమాలో చిన్న పాత్ర పోషించగా, తేజ్ ఇప్పటివకు చిరంజీవితో కలిసి నటించలేదు. వీరిద్దరూ గెస్ట్ రోల్స్‌లో కనిపిస్తారా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

దర్శకుడు వశిష్ఠ ఈ సినిమాను జగదేకవీరుడు అతిలోకసుందరి (Jagadeka Veerudu Athiloka Sundari) స్థాయిలో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అప్పట్లో ఆ సినిమా ప్రేక్షకులను ఎంత అలరించిందో, విశ్వంభర సినిమాతో కూడా అదే స్థాయిలో విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు VFX టెక్నాలజీ (VFX technology) పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందుకోసం హాలీవుడ్ టెక్నీషియన్లు (Hollywood technicians) వర్క్ చేస్తున్నారు. త్రిష కృష్ణన్ (Trisha Krishnan) ప్రధాన హీరోయిన్‌గా నటిస్తుండగా, మరికొంతమంది భామలు ఈ సినిమాలో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాను ఏప్రిల్ 2025లో విడుదల చేయడానికి చిత్రబృందం సిద్ధమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *