Chiranjeevi: బయటపడ్డ పర్సనల్ మేనేజర్, పీఆర్ ల అక్రమాలు.. ఉద్యోగం నుండి తొలగించిన చిరంజీవి.?
Chiranjeevi: ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస వివాదాల తలెత్తుతున్నాయి.. ఓవైపు మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.విష్ణు తనని చంపాలని చూస్తున్నాడు అంటూ మనోజ్ ఇప్పటికే చాలాసార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఆ గొడవ అలా ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాగార్జున పై పగబట్టినట్టు ఆయన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేసింది.అలాగే వారి ఫ్యామిలీ పై వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసింది.
Chiranjeevi who was fired from the job of Personal Manager and PR
ఇక రీసెంట్ గా పుష్పటు విడుదల సమయంలో రేవతి అనే మహిళ ఫ్యామిలీతో కలిసి సినిమా చూడడానికి వచ్చి ఆ తొక్కిసలాటలో ఊపిరాడక మరణించింది. ప్రస్తుతం ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ విషయాలు ఇలా ఉంటే తాజాగా చిరంజీవి తన పర్సనల్ పిఆర్ ని అలాగే పర్సనల్ మేనేజర్ ని తొలగించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి చిరంజీవి ఎన్నో సంవత్సరాల నుండి తన దగ్గర పనిచేస్తున్న ఆ ఇద్దరినీ తీసివేయడం వెనుక ఉన్న కారణాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. (Chiranjeevi)
Also Read: Allu Aravind: రేవంత్ రెడ్డిని కలవబోతున్న అల్లు అరవింద్.. కేసు నుండి బన్నీ గట్టెక్కుతాడా.?
చాలా మంది సెలబ్రిటీలు తమ మేనేజర్లుగా పిఆర్ లుగా బాగా తెలిసిన వారిని నమ్మకం ఉన్నవారిని పెట్టుకుంటారు.అలా చిరంజీవి కూడా తన దగ్గర ఎన్నో సంవత్సరాల నుండి నమ్మకం ఉన్న ఇద్దరిని మేనేజర్ గా పిఆర్ గా పెట్టుకున్నారు. కానీ తాజాగా వారిద్దరికీ సంబంధించిన అక్రమాలు మెల్లిమెల్లిగా బయటపడ్డాయి. ఇక ముఖ్యంగా చిరంజీవికి సంబంధించిన ప్రొఫెషనల్ పర్సనల్ అకౌంట్లకి సంబంధించిన డాక్యుమెంటేషన్ లో తప్పులు ఉన్నాయి అన్నట్లు గ్రౌండ్ స్టాప్ నుండి చిరంజీవికి సమాచారం వెళ్ళిందట.
దీంతో దాని గురించి పూర్తి విషయాలు తెలుసుకోగా చిరంజీవి దగ్గర పని చేసే బాబి మోహన్ ల అక్రమాలు బయటపడ్డాయి. దీంతో వెంటనే చిరంజీవి ఆ ఇద్దరిని ఉద్యోగం నుండి తొలగించారట. అంతేకాకుండా చిరంజీవి దగ్గర పని చేసే జీకే మోహన్ బిగ్బాస్ రియాల్టీ షో కి కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన ఒక లేడీ కంటెస్టెంట్ తో గత కొద్ది రోజులుగా ఎఫైర్ నడుపుతున్నట్టు తెలిసిందట.ఇక ఈ కారణం వల్ల కూడా చిరంజీవి ఆయన్ని తొలగించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది.(Chiranjeevi)