RC 16 కి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అయోమయంలో మెగా ఫ్యాన్స్!!
RC16: రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించి ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని అపోహలు వైరల్ అవుతున్నాయి. ఆ వార్తల్లో, ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగీత దర్శకుడు మారినట్లు వార్నితలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజం ఏమిటి అన్న ప్రశ్నలు తెగ వినిపించాయి. అయితే, ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టమైంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ మాత్రమే సంగీతం అందిస్తున్నారు.
ఇలా అనేక రూమర్లకు కారణం రామ్ చరణ్ అభిమానుల అత్యుత్సాహం అనే చెప్పాలి. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారని వారు అనుకోవడం మాత్రమే కాదు సోషల్ మీడియాలో హల్ఈచల్ చేశారు. దాంతో ఇదే నిజం అనుకున్నారు చాలామంది. కానీ, నిజం మాత్రం ఏ.ఆర్. రెహమానే ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.
ఆధికారిక సమాచారం ప్రకారం, ఈ చిత్రం కోసం ఏ.ఆర్. రెహమాన్ ఇప్పటికే కొన్ని పాటలను అందించారు. ఆయన సంగీతం సినిమా రేంజ్ ను పెంచుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రెహమాన్ సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవనుంది. రామ్ చరణ్ యొక్క తాజా చిత్రం ఆరంభమైనప్పటి నుంచి అభిమానుల్లో ఒక మిస్టరీగా విషయం ఇప్పుడు స్పష్టమైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.